Monday, December 23, 2024

అమెరికా వీసా కోసం లేని అన్నను సృష్టించాడు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: అమెరికాకు వెళ్లి పై చదువులు చదవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని చాలా మంది యువజనులు కలలు కంటుంటారు. తమ కలలు నెరవేర్చుకోవడం కోసం చాలా మంది చట్టబద్ధమైన మార్గం ఎంచుకుంటారు. కాని..కొందరు చట్టవ్యతిరేకమైన మార్గాలలోకి వెళ్లి చివరకు శ్రీకృష్ణ జన్మస్థానంలో తేలతారు. అలాంటి మార్గంలోనే అమెరికా వెళ్లాలనుకున్నాడు పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల జస్వీందర్ సింగ్. ఇందుకోసం అతను లేని కవల సోదరుడిని సృష్టించి అమెరికాలో అతని అంత్యక్రియలలో తాను పాల్గొనాల్సి ఉందంటూపాటియాలాకు చెందిన జస్వీందర్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. న్యూయార్క్‌లో తన కవల సోదరుడు కుల్వీందర్ సింగ్ మరణించాడని, అతని అంత్యక్రియలలో తాను పాల్గొనాలని ఇంటర్వూ కోసం న్యూఢిల్లీలోని అమెరికన్ ఎంబసీకి వెళ్లినపుడు చెప్పాడు.

ఇందుకు సాక్షంగా న్యూయార్క్‌లోని బీచర్ ఫ్లూక్స్ ఫ్యూనరల్ హోమ్ నుంచి నకిలీ పత్రాన్ని కూడా ఎంబసీ అధికారులకు అందచేశాడు. పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసు శాఖలో తాను  పనిచేస్తున్నట్లుగా జస్వీందర్ సింగ్ పత్రాలు సమర్పించాడు.  జస్వీందర్ ఫోటోకు, అతని కవల సోదరుడు కుల్వీందర్ ఫోటోకు ఎటువంటి తేడా లేకపోవడంతో అనుమానం వచ్చిన ఎంబసీ అధికారులు అతడు సమర్పించిన పత్రాల పరిశీలన చేపట్టారు. ఆ పత్రాలన్నీ ఫోర్జరీవని గుర్తించిన అధికారులు జస్వీందర్  పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News