Sunday, December 22, 2024

భటిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు … నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

 

ఛండీగఢ్: పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున దుండగులు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తీవ్రవాదులు జరిపిన దాడి కాదని ఎస్‌ఎస్‌పి గుల్‌నీత్ సింగ్ ఖురానా వెల్లడించారు. మిలటరీ స్టేషన్‌లో అంతర్గత ఘర్షణలు చోటుచేసుకోవడంతోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఇదే మిలటరీ క్యాంపు నుంచి ఆయుధాలు అదృశ్యమైనట్టు ఆరోపణలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News