Thursday, November 14, 2024

వసూళ్ల క్యాసెట్ కలకలం..

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : అవినీతి ఆరోపణలు చెలరేగిన నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర మంత్రి ఫౌజా సింగ్ తమ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి అయిన ఫౌజా సింగ్ సరారీ తన పదవిని అడ్డుపెట్టుకుని బలవంతపు వసూళ్లకు దిగుతున్నాడని తెలిపే ఆడియో క్లిప్ ఒక్కటి సామాజిక మాధ్యమాలలో ప్రచారంలోకి వచ్చింది. నెలల తరువాత ఈ ఆరోపణల నేపథ్యంలో శనివారం ఈ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు రాజీనామా లేఖను పంపించారు. సిఎం ఈ రాజీనామా లేఖను ఆమోదించినట్లు తెలిసింది. అయితే తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన మంత్రి పార్టీకి నమ్మిన బంటును అని, ఎప్పటికీ ఇదే విధంగా ఉంటానని ప్రకటించారు.

ఈ సింగ్ స్థానంలో మరో మంత్రి ప్రమాణస్వీకారం చేస్తారు. కొందరు కాంట్రాక్టర్లను ఏదో విధంగా బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఈ మంత్రి కొందరు అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన వైనం ఆ తరువాత క్యాసెట్ రూపంలో బయటకు రావడం రాజకీయ సంచలనానికి దారితీసింది. తనపై వచ్చిన ఆడియో పూర్తిగా కల్పితం అని ఆయన కొట్టిపారేశారు. ఈ మంత్రి రాజీనామాతో పంజాబ్ కేబినెట్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతాయని వెల్లడైంది. రిటైర్డ్ పోలీసు అధికారి అయిన సరారీ పంజాబ్ అసెంబ్లీకి ఫిరోజ్‌పూర్‌లోని గురు హర్ సహాయి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News