Saturday, December 21, 2024

యాదాద్రీశుడి దర్శనంలో పంజాబ్ మంత్రి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని పంజాబ్ రాష్ట్ర క్యాబినేట్ మంత్రి బల్జిత్ కౌర్‌తోపాటూ పంజాబ్ రాష్ట్రనికి చెందిన ఐఎఎస్, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంత్రి బల్జిత్‌ను కలసి పూల మొక్కను అందచేసాక, ఆలయ ఈవో గీత మంత్రికి స్వాగతం పలికారు. శ్రీ వారి ప్రధాన ఆలయంలో స్వయంబు దేవుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించగా, ఆలయ ఈవో శ్రీస్వామివారి ప్రసాదాన్ని అందచేశారు. శ్రీవారి దర్శనంలో మంత్రి వెంట ఐఎఎస్ అధికారులు రమేష్‌కుమార్,జస్‌ప్రిట్ సింగ్,ఉన్నత స్థాయి అధికారులు ఆశిష్ కత్తుర్య,జగదీఫ్ శర్మ,మహేంద్రపాల్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News