Wednesday, January 22, 2025

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ‘అగ్రికల్చర్ కస్టమర్ మీట్’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వరంగ పంజాన్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఎన్‌ఐఎంఎస్‌ఎంఇ వద్ద అగ్రికల్చర్ కస్టమర్ మీట్(వ్యవసాయ వినియోగదారుల సమావేశం) నిర్వహించింది. ఈ సమావేశంలో హైదరాబాద్ జోనల్ హెడ్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ, సర్కిల్ హెడ్ ఎన్.వి.ఎస్.ప్రసాద్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఎంఎస్‌ఎంఇ డైరెక్టర్ జనరల్ గ్లోరి స్వరూప, సెర్ప్ తెలంగాణ ప్రాజెక్ట్ మేనేజర్ జయంతి.బి హాజరయ్యారు. ఎస్‌హెచ్‌జిలు, అధిక నికర విలువ కల్గిన వ్యవసాయ వ్యాపారవేత్తలతో పాటు 100 మందికి పైగా ఈ సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో దాదాపు రూ.7.50 కోట్ల విలువచేసే వ్యవసాయ రుణాలను మంజూరు చేశారు.

Also Read: రాష్ట్రంలో వర్షభీభత్సం ! వణుకుతున్న జనం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News