- Advertisement -
చండీగఢ్ : పంజాబ్‌లో రోజురోజుకూ ఎన్నికల వేడి పెరుగుతోంది. మూడు రోజుల పంజాబ్ పర్యటనకు వచ్చిన ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్ శుక్రవారం ఫిల్లౌర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సభలో మాట్లాడుతూఏ పంజాబ్ రాష్ట్రానికి నిజాయితీ గల సీఎం అవసరమని అన్నారు. ప్రస్తుతం ఎన్కినల బరిలో ఒకవైపు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారని, మరోవైపు ఎప్పుడూ ఎవరి నుంచి ఒక పావలా కూడా తీసుకోని వ్యక్తి పోటీలో ఉన్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ సిఎం అభ్యర్థి భగవంత్ మాన్ నిజాయితీపరుడని చెబుతూ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎవరు నిజాయితీ పరులో, ఏ పార్టీకి ఓటేస్తే నిజాయితీ పరుడు సీఎం అవుతారో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -