Thursday, January 23, 2025

పంజాబ్‌కు కీలకం

- Advertisement -
- Advertisement -

నేడు లక్నోతో పోరు


పుణె: ఐపిఎల్‌లో భాగంగా శుక్రవారం పుణె వేదికగా జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తల పడనుంది. పంజాబ్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. నాకౌ ట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సిన పరిస్థితి పంజా బ్‌కు నెలకొంది. ఇక సిఎస్‌కెతో జరిగిన కిందటి మ్యాచ్‌లో పం జాబ్ ఉత్కంఠ విజయం సాధించింది. ఈసారి కూడా అదే జో రును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలిం గ్ విభాగాల్లో పంజాబ్ బలంగానే ఉంది. అయితే నిలకడలేమీ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతు న్నాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఇక సీని యర్ ఆటగాడు బెయిర్‌స్టో ఈ సీజన్‌లో పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నాడు.

ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. ఈసారైనా బెయిర్‌స్టో మెరుగై న బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం జట్టుకు ఎంతో ఉంది. కాగా, స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టుకు కీలకంగా మారాడు. కిందటి మ్యాచ్‌లో ధావన్ మెరుగైన బ్యాటింగ్‌తో జ ట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా అతని నుంచి ఇలాం టి ప్రదర్శనే జట్టు ఆశిస్తోంది. రాజపక్సా కిందటి మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకొంది. లివింగ్‌స్టోన్ ఫామ్‌లో ఉండడం పంజాబ్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే లివింగ్‌స్టోన్ విజృంభిస్తే పంజాబ్‌కు భారీ స్కోరు కష్టమేమీ కాదు. వికెట్ కీపర్ జితేష్ శర్మపై కూడా భారీ అంచనాలతో ఉంది. జితేష్ మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. కాగా బౌలింగ్ పంజాబ్ చాలా బలంగా ఉంది. రబడా, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్ తదితరులతో బౌలింగ్ విభాగంగా పటిష్టంగా కనిపిస్తోంది. కిందటి మ్యాచ్‌లో రబడా, అర్ష్‌దీప్ అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా పంజాబ్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో విజయం సాధించింది.

జోరుమీదుంది..

మరోవైపు కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఐదు మ్యాచుల్లో గెలిచి టాప్4లో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకొంది. కెప్టెన్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలతో సత్తా చాటాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. రాహుల్ ఫామ్‌లో ఉండడం లక్నోకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అయితే డికాక్, స్టోయినిస్, కృనాల్ పాండ్య, మనీష్ పాండే. దీపక్ హుడా తదితరులు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. ఈసారైనా వీరు బ్యాట్‌తో మెరుపులు మెరిపించాల్సిన అవసరం ఉంది. కాగా, హోల్డర్, చమీరా, కృనాల్, బిష్ణోయ్ తదితరులతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న లక్నో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News