- Advertisement -
పంజాబ్: పంజాబ్ లోని బాటాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాలలోకి వెళితే.. పోలీసులు , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. కారు ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను చూసి స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు వాహనాలను తొలగించారు.
- Advertisement -