Monday, December 23, 2024

బలపడుతున్న బంధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీలు జతకట్టే సూచన లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రెండు పార్టీ ల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇటీవలి కాలంలో పంజాబ్ నుంచి ఆప్ నేతలు హైదరాబాద్‌కు వరుస క డుతుండడం ఇందుకు ఊతమిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హైదరాబా ద్ వచ్చి వెళ్లిన వారానికే ఆ రాష్ట్రానికి చెందిన ఒక ప్రతినిధి బృందం తెలంగాణకు వచ్చింది. ఆ బృందం రెండు రోజుల క్రితం నిజామాబాద్‌లో పర్యటించి సిఎం కెసిఆర్ పాలనా తీరుపై పెద్దఎత్తున ప్రశంసలు గుప్పించింది. పైగా తెలంగాణ సిఎం కెసిఆర్, ఆప్ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోనే దేశంలో రైతు రాజ్యం సాధ్యమవుతుందని ఆ బృందానికి నాయకత్వం వహించిన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత కుల్తార్ సింగ్ సంధ్వాన్ ప్రకటించారు. సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్న సిఎం కెసిఆర్‌కు అందరూ మద్దతివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

. ఈ ప్రకటనలు చూస్తుంటే… ఆప్ పార్టీ, బిఆర్‌ఎస్‌ల మధ్య సరికొత్త స్నేహం చిగురిస్తోందన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. పైగా కేజ్రీవాల్, కెసిఆర్‌లు ఇద్దరు కేంద్రంలోని మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. అనేక అంశాల్లో వారిద్దరూ బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఘాటుగా స్పందిస్తున్నారు. కేంద్ర సర్కార్‌పై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టినా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. అదే రీతిలో ప్రస్తుతం కెసిఆర్ కూడా మోడీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై కుట్రలు చేసిన మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అస్థిర పరిచేందుకు కేంద్రం అనేక రకాలుగా యత్నించి విఫలమైంది. ఇటీవల బిఆర్‌ఎస్ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బిజెపికి చెందిన కొందరు దూతలు హైదరాబాద్‌కు వచ్చి అడ్డంగా ఇరుకున్నారు.

ఈ వ్యవహారంలో కేంద్రం హస్తం ఉందన్న ఆడియో, వీడియో టేపుల వివరాలను కెసిఆర్ బయటపెట్టారు. ఆ ఆడియో, వీడియో టేపులు దేశంలోని సుప్రీంకోర్టు జడ్జిలకు, హైకోర్టు జడ్జిలకు, బిజెపియేతర రాష్ట్రల ముఖ్యమంత్రులకు, ప్రతపక్ష పార్టీల అధ్యక్షులకు పంపించారు. ఇలా కేంద్ర కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొవడమే కాకుండా ప్రస్తుతం బిఆర్‌ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఇక త్వరలోనే ఢిల్లీ వేదికగా బిఆర్‌ఎస్ పార్టీ సిద్దాంతాలను, లక్ష్యాలను, ఎజెండాను దేశ ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. తదనంతరం అన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను నెలకొల్పేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలను కలుపుకుని ముందుకు సాగాలని కెసిఆర్ భావిస్తున్నారు. ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని అంశాలపై కెసిఆర్ జాగ్రత్త పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆప్ పార్టీ క్రమక్రమంగా దూసుకపోతున్నది. ఢిల్లీ నుంచి ప్రస్తానమైన ఆ పార్టీ ప్రభంజనం ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లోనూ కొనసాగింది. తొలిసారిగా అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆప్ పార్టీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తూ క్రమక్రమంగా ఓటు బ్యాంక్ పెంచుకుంటూ పోతోంది. కాగా కొద్ది రోజుల క్రితం జరిగినగుజరాత్ ఎన్నికల్లోనూ ఘనంగా తన ఉనికికి చాటుకుంది. ముందు ముందు ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ వంటి బలమైన నేతతో జతకడితే మరిన్ని విజయాలను సాధించేందుకు అవకాశముంటుందని ఆప్ పార్టీ కూడా యోచిస్తోంది. అదే సమయంలో మోడీకి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీని కూడా వదలిపెట్టకుండా అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ దేశంలోనే బిఆర్‌ఎస్ అతి పెద్ద పార్టీగా తీసుకెళ్లాలని కెసిఆర్ సైతం భావిస్తున్నారు.

కేజ్రీవాల్ ఉత్తరాదిన ఎ్కకువ పాపులర్ అయితే కెసిఆర్ కేసీఆర్ దక్షిణాదిన పాపులర్‌గా ఉన్నారు. దీంతో ఒకరు ఉత్తరాదిన.. మరొకరు దక్షిణం చూసుకుంటే దేశ రాజకీయాల్లో కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరి వారిద్దరూ కలిసే మోడీపై పోరాటం చేస్తారా? లేక ఎవరి స్థాయిలో వారే సై అంటారా? అన్నది మునుముందు తేలనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News