Monday, December 23, 2024

పంజాబ్ లక్ష్యం 160

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఐపిఎల్‌లో భాగంగా భారత రత్నా శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని లక్నో ఉంచింది. కెఎల్ రాహుల్ 56 బంతుల్లో 74 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు దూకుడుగా ఆడకపోవడంతో తక్కువ పరుగులు లక్నో చేయాల్సి వచ్చింది. రబడా తన బౌలింగ్ లో పాండ్యా, నికోలస్ పూరాన్ వరసగా రెండు బంతుల్లో ఔట్ చేసి లక్నో వెన్నువిరిచాడు.  లక్నో బ్యాట్స్‌మెన్లు మేయిర్స్ (29), కృనాల్ పాండ్యా(18), మార్కస్ స్టయినీస్ (15), దీపక్ హుడా(02), అయుష్ బదోనీ(05 నాటౌట్), రవి బిష్ణోయ్ (03 నాటౌట్) కృష్ణప్ప గౌతమ్(01), యుధ్వీర్ సింగ్ చరాక్(0), నికోలస్ పూరాన్(0) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో శ్యామ్ కుర్రాన్ మూడు వికెట్లు పడగొట్టగా కగిసో రబడా రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, హర్పీత్ బ్రార్, సికిందర్ రాజా తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News