Thursday, December 19, 2024

అర్ధ నగ్నంగా మహిళ ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: కూతురుని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువకుడి తల్లిపై దాడి చేసి అర్థనగ్నంగా ఊరేగించిన సంఘటన పంజాబ్ రాష్ట్రం తరన్ తారన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఓ యువకుడు, యువతి ప్రేమలో పడ్డాడు. యువతితో యువకుడు పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబం సభ్యులు ఆగ్రహం రగిలిపోయారు. యువకుడి ఇంటికి వెళ్లి అతడి తల్లిపై దాడి చేశారు. అనంతరం ఆమెను అర్థనగ్నంగా చేసి ఊరేగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అర్థనగ్నం వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News