Monday, December 23, 2024

ఆ రెండు ఓవర్లే కొంపముంచాయి: ధోనీ

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా చెపాక్ స్టేడియంలో చెన్నైసూపర్ కింగ్స్ , పంజాబ్ కింగ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ గెలుపొందింది. పంజాబ్ ముందు చెన్నై 201 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు కొంప ముంచాయని చెన్నై కెప్టెన్ ధోనీ తెలిపాడు. దేశ్ పాండే 16వ ఓవర్‌లో 24 పరుగులు ఇవ్వగా జడేజా 17 ఓవర్‌లో 17 పరుగులు ఇవ్వడంతో జట్టు ఓటమి పాలైందని విమర్శలు చేశాడు. బ్యాటింగ్ అనుకూలించిన పిచ్‌పై మరో 15 పరుగులు చేసి బాగుండేదన్నారు. పతిరానా అద్భుతంగా బౌలింగ్ చేశాడని ధోనీ కొనియాడారు. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిచి ఉంటే పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉండేది ఇప్పుడు నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావడంతో ప్లే ఆప్ అవకాశాలు క్లిష్టంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: చంపేస్తామంటూ బెదిరింపులందుతున్నాయి: సల్మాన్ ఖాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News