Tuesday, December 24, 2024

పంజాబ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఉత్కంఠ పోరులో ఆర్‌సిబిపై 5 వికెట్ల తేడాతో గెలుపు

Punjab won on RCB
ముంబయి: మెగా టి20 లీగ్ ఐపిఎల్‌లో ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బోణీ కొట్టింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడిన ఆర్‌సిబి నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది.ఆ తర్వాత 206 పరుగుల విజయ లక్ష ఛేదనలో పంజాబ్ వీరోచితంగా పోరాడింది. మయాంక్ అగర్వాల్(32), శిఖర్ ధావ న్(43),రాజపక్స(43), ఓడియన్ స్మిత్(25 నాటౌ ట్), షారుక్ ఖాన్(24 నాటౌట్) అందరూ మెరుగైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించా రు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సిబి బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా కెప్టె న్ డుప్లెసిస్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవ లం 57 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 88 పరుగు లు చేశాడు.అతడి దెబ్బకు పంజాబ్ బౌలింగ్, ఫీల్టింగ్ కకావికలైంది. డుప్లెసిస్ అనూజ్ రావత్(21)తో కలిసి తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అనంతరం రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రావత్ అవుటయ్యాడు.తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి డుప్లెసిస్ జాగ్రత్తగా ఆడాడు. కోహ్లీ క్రీజ్‌లో కుదురుకున్నాక ఇద్దరూ చెలరేగి పోయారు. కోహ్లీ 29 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. మరో వైపు సెంచరీ దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించిన డుప్లెసిస్ అర్షదీప్ బౌలింగ్‌లో షారూక్‌ఖా న్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన దినేశ్ కార్త్తీక్ కూడా బ్యాట్‌తో శి వాలెత్తాడు.14 బంతుల్లోనే 3 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 32 పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News