Sunday, April 27, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరుగతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో సొంతగడ్డపై కోల్‌కతాని పంజాబ్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 111 పరుగులు చేసిన పంజాబ్ కోల్‌కతాని 95 పరుగులకే ఆలౌట్ చేసి ఆ టార్గెట్‌ని డిఫెండ్ చేసి రికార్డు సృష్టించింది. దీంతో కోల్‌కతా ఈ మ్యాచ్‌కి తమ సొంత మైదానంలో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం దక్కించుకోవాలని పంజాబ్ ఉత్సాహంగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు రెండు మార్పులు చేశాయి. పంజాబ్‌ జట్టులోకి మ్యాక్స్‌వెల్, ఓమర్‌జాయి వచ్చారు. కోల్‌కతా జట్టులో మొయిన్ స్థానంలో పొవెల్, రమన్‌దీప్ స్థానంలో సకరియాని జట్టులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News