Sunday, April 13, 2025

హైదరాబాద్‌తో మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని కమ్మిన్స్ సేన అనుకుంటోంది. లీగ్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో విజయం సాధించిన పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ అదే జట్టుతో బరిలోకి దిగుతుండగా.. సన్‌రైజర్స్ ఒక మార్పు చేసింది. కమిందు మెండీస్ స్థానంలో ఈశాన్ మలింగాను జట్టులోకి తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News