Tuesday, December 24, 2024

ఢిల్లీలో కచేరీ చేస్తే చంపేస్తాం..పంజాబీ గాయనికి బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రఖ్యాత పంజాబీ గాయని జాస్మిన్ సంద్లాస్‌కు శనివారం చంపేస్తామనే బెదిరింపులు వచ్చాయి. అమెరికాలో ఉండే ఈ గాయని న్యూఢిల్లీలో తమ సంగీత కచేరీ నిర్వహించేందుకు ఇక్కడికి వచ్చారు. స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో పెద్ద ఎత్తున ఆమె మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు అయింది. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే ఆమెకు ఫోన్‌కాల్ వచ్చింది. అంతర్జాతీయ నెంబరు నుంచి వచ్చిన ఈ కాల్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుల నుంచి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు.

తాను ఇక్కడికి రాగానే పలుసార్లు బెదిరింపుల ఫోన్లు వచ్చాయని ఈ సింగర్ తెలిపారు. తనపై స్టేడియంలో దాడి జరగవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ ఆమె బసచేసే ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఆమెకు భద్రతా వలయం ఏర్పాటు చేశారు. పలు పాప్ సాంగ్స్ ఆల్బమ్స్‌తో పాటు కొన్ని ప్రముఖ హిందీ సినిమాలలో కూడా ఈ గాయని పాటలు పాడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News