Monday, January 20, 2025

భద్రత పెంచాలని మరో గాయకుడు అవులఖ్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

Punjabi singer Mankirt Aulakh demands security cover

 

చండీగఢ్ : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య తరువాత మరో గాయకుడు మన్‌కిర్ట్ అవులఖ్ కు అలాంటి బెదిరింపులు గత ఏప్రిల్‌లో ఎదురైనట్టు వెలుగు లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అవులఖ్ తనకు దేవిందర్ బాంబిహా గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నందున తన భద్రతను పెంచాలని పంజాబ్ పోలీస్‌లను డిమాండ్ చేశారు. మే 29 న సిద్దూ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కెనడాలో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ సిద్దూ మూసేవాలా హత్యకు తానే బాధ్యుడినని ప్రకటించారు. లారెన్స్ బైష్ణోవ్ గ్యాంగ్‌కు అత్యంత సన్నిహితుడు గోల్డీబ్రార్. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని కోర్టు వెల్లడించింది. లారెన్స్ జైలుకు వెళ్లిన తరువాత గోల్డీబ్రార్ లారెన్స్ గ్యాంగ్‌ను నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News