Thursday, January 23, 2025

మాన్సాలో పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూస్ వాలా కాల్చివేత

- Advertisement -
- Advertisement -

Moose Wala

 

అమృత్ సర్: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ మూస్ వాలా ఆదివారం మాన్సా సమీపంలో కాల్చివేతకు గురయ్యాడు . జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో అతనిపై  కనీసం 10 సార్లు కాల్పులు జరుగగా మరణించాడు.  కాగా అతడు మాన్సాలోని సివిల్ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు.

మూస్ వాలా భద్రతను ఉపసంహరించుకున్న ఒక రోజు తర్వాత ఇది జరిగింది. విఐపి  సంస్కృతిని అరికట్టేందుకు భగవంత్ మాన్ ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా నిన్న తమ భద్రతను కోల్పోయిన 424 మంది విఐపిల్లో  మూస్ వాలా కూడా ఉన్నారు.

సిద్ధూ మూస్ వాలా,  మాన్సా సమీపంలోని మూస్ వాలా గ్రామానికి చెందినవాడు.  గత కొన్ని సంవత్సరాలుగా అనేక సూపర్‌హిట్ పాటలకు గాత్రదానం చేశాడు. మాన్సా నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై మూస్ వాలా  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ‘ఆప్‌’కి చెందిన డాక్టర్ విజయ్ సింగ్లా చేతిలో 63,323 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News