Monday, December 23, 2024

ఆస్ట్రేలియాలో పంజాబీ యువతి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాలో భారత్‌కు చెందిన 21 ఏండ్ల నర్సింగ్ విద్యార్థిని జాస్మీన్ కౌర్‌ను అత్యంత దారుణంగా హింసించి సజీవంగా పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని ఫిండ్లర్స్ రేంజెస్‌లో పంజాబ్‌కు చెందిన ఈ యువతి మాజీ ప్రియుడు, భారతీయ సంతతికి చెందిన తరిక్‌జోత్ సింగ్ చంపివేసినట్లు గుర్తించారు. కోర్టులో ఈ ఉదంతంపై జరిగిన విచారణ వివరాలను 9 న్యూస్ వెలువరించింది. తాను మాజీ ప్రియురాలిని ప్రతీకారంతోనే చంపినట్లు అంగీకరించినట్లు చెప్పాడు. సింగ్ ఈ యువతిని కేబుల్స్‌తో కట్టిపడేసి, చంపినట్లు ఇప్పుడు వెల్లడైంది. 2021 మార్చిలో తాను కౌర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఈ వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నేరం అంగీకరించాడు. ఇప్పుడు ఈ వ్యక్తి పరమకిరాతక కృత్యం నిర్థారణ అయింది. సింగ్ ఈ యువతిని కిడ్నాప్ చేసి పొదల మధ్య ఉన్న గుంతలోకి కట్టిపడేసి పారేసినట్లు వెల్లడైంది.

తరువాత యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యువతి తనతో విడిపోవడం సహించలేకనే ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. ముందు ఈ యువకుడిని నమ్మి ప్రేమించిన సింగ్ ప్రవర్తనలో మార్పు చూసి ఆమె దూరం అయింది. ఆమె వందసార్లు తిరస్కరించినా ఈ యువకుడు తన కూతురు వెంటబడి వేధిస్తూ వచ్చాడని కౌర్ తల్లి రష్‌పౌల్ తెలిపింది. అడ్లెయిడ్‌లో ఆమె పనిచేస్తున్న చోటుకు వెళ్లి సింగ్ తీసుకువెళ్లాడు. కారులో నాలుగు అయిదు గంటలు తిప్పి పైశాచికంగా వ్యవహరించాడు. కళ్లకు గంతలు కట్టి, భుజాలు విరిచికట్టేసి సమాధిలో పడేసి వెళ్లినట్లు తెలిసింది. ఇది అత్యంత క్రూరమైన అసాధారణ స్థాయి ఘటన అని ప్రాసిక్యూటర్ కార్మెన్ మాటెఒ తెలిపారు. ఆమె సజీవంగా ఉన్నప్పుడు నానా రకాలుగా హింసించినట్లు ఈ వ్యక్తి తన అంగీకార క్రమంలో తెలిపాడు. ఆమె చాలా సేపు ఊపిరిపీల్చుకోలేక, చివరికి సమాధిలోని మట్టి మింగాల్సి వస్తూ నరకం అనుభవించి చనిపోయి ఉంటుందని ఈ లేడీ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News