Thursday, January 23, 2025

అందంగా ముస్తాబైన ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు

- Advertisement -
- Advertisement -

పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ట్వీట్‌ను
రీట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్


మనతెలంగాణ/హైదరాబాద్:  అందంగా ముస్తాబైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలంటూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ చేసిన ట్వీట్‌ను పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ రీట్వీట్ చేశారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పాదచారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తీసుకొస్తుంది. పాదచారులను ఆకర్షించేలా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా ఈ బ్రిడ్జిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మొత్తం ఉడెన్ కలర్‌తో రూపొందించిన ఈ బ్రిడ్జి పంజాగుట్ట సర్కిల్‌కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మరో 6 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను రాబోయే 4 నుంచి 6 వారాల్లో ప్రారంభించనున్నట్లు పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఫొటోలను ట్వీట్ చేయగా, ఆ ట్వీట్లను మంత్రి కెటిఆర్ రీట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News