Sunday, December 22, 2024

పంజాగుట్టలో బస్సు ఢీకొని మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పంజాగుట్ట కూడలిలో మంగళవారం చోటు చేసుకుంది. మృతురాలు ఎర్రమంజిల్‌లో హౌస్‌కీపింగ్‌గా పని చేస్తున్న రమ్యగా గుర్తించారు. ఎర్రమంజిల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు క్లియర్ చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: రక్షాబంధన్ కు మోడీ గిఫ్ట్… రూ.200 తగ్గిన గ్యాస్ ధర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News