Monday, December 23, 2024

గురువారం పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిని గురువారం ప్రారంభించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Punjagutta steel bridge opened day after tomorrow
హైదరాబాద్:   పంజాగుట్ట గ్రేవ్ యార్డ్ పాత ముఖద్వారాన్ని తొలగించి  నూతనంగా నిర్మించిన కేబుల్  బ్రిడ్జి వలన స్మశానవాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు తొలగి పోతున్నాయని, పాత గేట్ నుండి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు వెడల్పు చేసినందున  నాగార్జున సర్కిల్  నుండి కె.బి.అర్ పార్క్ జంక్షన్ కు వెళ్లే వాహనాలు ఎలాంటి ట్రాఫిక్ సమస్య  ఉత్పన్నం కాకుండా నేరుగా వెళ్లవచ్చు.  గ్రేవ్ యార్డ్ వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది తో పాటుగా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవ్వడంతో జిహెచ్ఎంసి శాశ్వత పరిష్కారం చేయుటకు రూ. 17 కోట్ల రూపాయలను మంజూరు చేసి స్టీల్ బ్రిడ్జి, పాత గేట్ నుండి హెచ్.టి  లైన్ వరకు రోడ్డు విస్తరించడం మూలంగా గతంలో ఏర్పడిన ట్రాఫిక్ సమస్య  తీరుతుంది.

 హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది. తద్వారా ట్రాఫిక్  సమస్యలకు చెక్  పెట్టడమే కాకుండా ప్రజల అవసరాలు  తీరుతున్నాయి. మొత్తం రోడ్డు విస్తీర్ణం  140 మీటర్లు కాగా అందులో అప్రోచ్ రిటర్నింగ్ వాల్  57 మీటర్లు, 9.6 మీటర్ల ఫ్లైఓవర్  మొత్తం 46 స్టీల్ గ్రీడర్స్ ఏర్పాటు చేసి పనులను పూర్తి చేశారు. ఈ  బ్రిడ్జిని గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్  శ్రీలత శోభన్ రెడ్డి, శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, ఎంపిలు, కార్పొరేటర్లు తదితరులు  పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News