మధ్యప్రదేశ్‌లో ముగ్గురు నిందితుల అరెస్టు
పక్కా ప్రణాళికతో దాడి చేసి, హత్య చేసిన వైనం
మన తెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ జంట హత్యల కేసులో రాహుల్, రాజ్‌కుమార్, సుఖీంద్ర అనే ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇద్దరిని చంపి నిందితులు మధ్యప్రదేశ్ పారిపోయారు. బిందు గత కొంత కాలంగా వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంకిత్ స్నేహితుడు రాహుల్ బిందును అసభ్యకరంగా తీసిన వీడియోతో వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
అంకిత్, బిందుపై కోపంతో వారిని చంపాలని రాహుల్ నిర్ణయించు కున్నట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీసులు వెల్లడించారు. దీంతో రాజ్‌కుమార్, సుఖేంద్ర సాయంతో అంకిత్, బిందును రాహుల్ హతమార్చినట్లు వెల్లడించారు. వీరిద్దరిని చంపిన అనంతరం నిందితులు మధ్యప్రదేశ్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మధ్యప్ర దేశ్‌లో ముగ్గురిని పట్టుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. హత్యకు గురైన బిందు ఈ నెల 3న అదృశ్యమైనట్లు వనస్థలిపురంలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
కాగా ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతి చెందిన అంకి త్, బిందుపై ఈ నెల 8న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. నార్సింగి పరిధిలోని పుప్పాలగూడలో వీరు మంగళవారం దారు ణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా వీరిని సంక్రాంతి పండుగ రోజే నిందితులు పక్కా ప్రణాళికతో దాడి చేసి హతమార్చడంతో ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు మృతదేహాలను పరిశీలించి ఇద్దరూ దారుణహత్యకు గురైనట్టు గుర్తించారు. కత్తులతో పొడిచి అనం తరం బండ రాళ్లతో తలపై బాది హత్య చేసినట్టు ఆనవాళ్లున్నాయి. ఘటనా స్థలికి దూరంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పోస్టుమా ర్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో కొన్ని ఆధారాలు సేకరించామని, వాటి ద్వారా మృతుల వివ రాలు గుర్తించి, అలాగే నిందితులను పట్టుకుంటామని గతంలోనే పోలీసులు వెల్లడించారు.