Sunday, January 19, 2025

ఇదేం పనిరా?: కుక్కపిల్లకు మందు తాగించిన తాగుబోతు! (వీడియో)

- Advertisement -
- Advertisement -

ఓ తాగుబోతు తాను మందు కొట్టడమే కాకుండా, తన పెంపుడు కుక్కపిల్లకు కూడా తాగించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వాడిపై చర్య తీసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ కు చెందిన షేరూ బోర్డా అనే యువకుడు మందు కొడుతూ, పక్కనే ఉన్న తన కుక్క పిల్లకు కూడా మందు తాగించాడు. దీనిపై జంతు సంక్షేమ సంఘం ప్రతినిధి పూనమ్ బగ్రి మండిపడ్డారు. ‘బాధ్యత లేకుండా ప్రవర్తించే ఇలాంటి వాళ్ల వల్లే కుక్కలు మనుషులను కరుస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. వీళ్లు జంతువుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. నెటిజన్లు షేరూ బోర్డేను తిడుతూ పోస్టులు పెడుతున్నారు.

ఈ వీడియోను పోస్ట్ చేసిన షేరూ బోర్డాపై చర్యలకు పోలీసులు నడుం బిగించారు. అతనికోసం గాలింపు చేపట్టారు. కుక్కలలో ఆల్కహాల్ ను జీర్ణం చేసుకునే ఎంజైమ్ లు ఉండవు. అందువల్ల ఆల్కహాల్ విషంగా మారి, కుక్కల ప్రాణాలని హరిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కుక్కపిల్లలు ఆల్కహాల్ తాగితే శ్వాస సంబంధిత సమస్యలు ఎదురుకావడమే కాకుండా, వాటి శరీర ఉష్ణోగ్రత కూడా పడిపోయి, అవి మరణానికి చేరువవుతాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News