Wednesday, January 22, 2025

బోయింగ్, ఎయిర్‌బస్ నుంచి 470 విమానాల కొనుగోలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఇండియా ప్యారిస్‌లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో మరో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ వృద్ధి ప్రధాన లక్ష్యంగా సుమారు 470 విమానాల కోసం ఎయిర్‌బస్, బోయింగ్‌లతో ఒప్పందం చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది.  ఈ డీల్ విలువ 70 బిలియన్ డాలర్లు, అంటే రూ.5,74,123 కోట్లు ఉంటుంది. ఈ ఒప్పందంలో భాగంగా వచ్చే కొద్ది నెలల్లో డెలివరీలను ప్రారంభించనున్నారు. వీటిలో ఎయిర్‌బస్ ఎ350 విమానం ఉంది. 2025 నుంచి డెలివరీలు ఉంటాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా 122 విమానాలను కల్గివుండగా, మొత్తం 36 ఎయిర్‌బస్ ఎ320లను లీజ్‌కు తీసుకుంటోంది.

ఎయిర్ ఇండియా దీర్ఘకాలిక వృద్ధి, విజయానికి ఇది ఒక మైలురాయి, ప్రపంచానికి ఒక ఉత్తమ, ఆధునిక విమాన సంస్థను అందిస్తామని ఆశిస్తున్నామని ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అన్నారు. దీనికి ముందు రోజు ఇండిగో కూడా భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్యారిస్ ఎయిర్‌షో మొదటి రోజు భారతదేశంలో అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో చరిత్రలోనే అతిపెద్ద ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్‌లో దాదాపు 500 ఎయిర్‌బస్ ఎ320 ప్యామిలీ విమానాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఇటీవల అత్యధికంగా 470 విమానాలకు ఆర్డర్ ఇవ్వగా, ఇప్పుడు ఇండిగో దీనిని అధిగమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News