ధరల స్థిరీకరణ కోసం ఐదు లక్షల టన్నుల ఉల్లి కొనుగోలు చేయాలని లక్షం నిర్ణయించుకోగా బఫర్ నిల్వ కోసం ప్రభుత్వంఈ ఏడాది ఇంత వరకు సుమారు 71 వేల టన్నులు కొనుగోలు చేసింది. దేశంలో అనేక ప్రాంతాల్లో రుతుపవనాల పురోగతితో ఉల్లి రిటైల్ ధరలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం (డిసిఎ) సంకలనం చేసిన డేటా ప్రకారం, అఖిల భారత సగటు ఉల్లి రిటైల్ ధరలు శుక్రవారం కిలోకు రూ. 38.67గా ఉన్నాయి, మోడల్ ధర కిలోకు రూ. 40. కేంద్రం గురువారం (20) వరకు 70987 టన్నుల ఉల్లి సేకరించిందని, నిరుడు ఇదే కాలంలో సేకరించిన పరిమాణం 74071 టన్నులు అని డిసిఎ సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ‘అంచనా వేసిన రబీ ఉత్పత్తిలో దాదాపు 20 శాతం తగ్గుదల ఉన్నా ఈ ఏడాది ధరల స్థిరీకరణ నిమిత్తం ఉల్లి సేకరణ తీరు నిరుటితో బాగా పోల్చదగినది’ అని ఆయన తెలిపారు.
ధరల స్థిరీకరణ కోసం 5 లక్షల టన్నుట సేకరణ లక్షం సాధించే దశలో ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు, ఉల్లి ధరల్లో స్థిరత్వం కోసం ఉల్లి నిల్వను కొనసాగించడానికి లేదా బఫర్ నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉందని అధికారి తెలిపారు, సేకరణ ధర ఇప్పుడు ఉన్న మార్కెట్ ధరలతో ముడిపడిన క్రియాశీలకమైనది. ప్రధాన ఉత్పత్తి ప్రాంతాల్లో తక్కువ వర్షాల వల్ల ఖరీఫ్, రబీలో దాదాపు 20 శాతం మేర ఉత్పత్తిలో లోటు కారణంగా ఉల్లి ధరలు అంతకు ముందు సంవత్సరంలో కన్నా పెరిగాయని అధికారి వివరించారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం నిరుడు ఆగస్టు నుంచి క్రమ పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నది, ముందుగా 40 శాతం ఎగుమతి సుంకంవిధించిన ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో టన్నుకు 800 అమెరికన్ డాలర్ల కనీస ఎగుమతి ధర (ఎంఇపి) నిర్ధారించి, డిసెంబర్ 8న ఎగుమతిపై నిషేధం విధించింది.
ఈ చర్యల వల్ల దేశీయంగా స్థిర ధరలకు ఉల్లి లభ్యతను ప్రభుత్వం కొనసాగించగలిగింది, మహారాష్ట్రలోనిలాసల్‌గావ్ వంటి ప్రధాన విపణులలో గణనీయమైన స్థిరత్వం దృష్టాను, ఈ ఏడాది మామూలుకు మించి వర్షాలు కురియగలవన్న సూచనల నేపథ్యంలో ఖరీఫ్ ఉత్పత్తి బాగా ఉండే అవకాశం దృష్టాను టన్నుకు 550 అమెరికన్ డాలర్ల ఎంఇపితో, 40 శాతం ఎగుమతి సుంకంతో ఉల్లి ఎగుమతిపై నిషేధాన్ని గత మే 4న ప్రభుత్వం ఉపసంహరించింది. కాగా, దేశంలో విస్తృత ప్రాంతాల్లో దీర్ఘకాలంగా సాగుతున్న, హీట్‌వేబ్ పరిస్థితులు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేసినట్లు, టొమాటో, బంగాళాదుంపల, ఉల్లితో సహా కూరగాయల ధరల పెరుగుదలకు దారి తీసినట్లు అధికారి తెలియజేశారు, దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల ప్రవేశంతో ఈ పరిస్థితి మెరుగుపడవచ్చునని ఆయన సూచించారు, మార్చిలో ఉల్లి ఉత్పత్తికి సంబంధించిన డేటాను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం ఉల్లి ఉత్పత్తి సుమారు 254.73 లక్షల టన్నుల మేరకు ఉందవచ్చు.