Thursday, January 23, 2025

ఇనాం భూములకు రెక్కలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇనాం కొనుగోలు చేసిన యజమానులు ఆ భూములును కోల్పోనున్నారు. పేదలకు ఇ చ్చిన ఇనాం భూములు భారీగా చేతులు మారిన ట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే వాటి ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సమాయ త్తం అవుతోంది. ఇప్పటికే ఈ భూములపై హైకోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ భూములు కొన్న వారు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్య హక్కు పత్రం (ఓఆర్సీ- ఓనర్ షిప్ రైట్స్ సర్టిఫికెట్) లేకుండా ఇనాందారులు నుంచి భూమిని కొనుగోలు చేసిన వారు ఆ భూములను ఎలా కాపాడుకోవాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇనాందారుల నుంచి భూ మి కొన్న వారు ఓఆర్సీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని రాష్ట్ర హైకోర్టు నవంబర్ 21న తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూ డా హైకోర్టు తీర్పు ఆధారంగా విక్రయించిన భూ ములను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.
1986 జాతీయ భూ సంస్కరణ అమ లు కమిటీ నివేదిక ప్రకారం ఉమ్మడి పది జిల్లాలో కలిపి సుమారుగా 8,05,618 ఎకరాల భూమిని ఇనాం కింద పలువురు రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ భూమిని సుమారుగా 92,250 మంది రైతుల కు పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఇనాం భూములు చాలామంది చేతులు మారినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతోపాటు పలువురు ఓఆర్సీ కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా గు ర్తించిన ప్రభుత్వం ఓఆర్సీ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. అయితే రైతుల నుంచి ఈ ఇనాం భూములను కొ నుగోలు చేసిన యజమానులు కోర్టుకు వెళ్లగా హై కోర్టు వారికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,386 లబ్ధిదారులకు 59, 100 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 4,415 మం దికి 13,954 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2,390 లబ్ధిదారులకు 26,949 ఎకరాలు, మెదక్ జిల్లాలో 26,234 మంది లబ్ధిదారులకు 1,33,716 ఎకరాలు, నల్లగొండలో 10,625 మందికి 1,73, 330 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 7,356 మంది కి 42,260 ఎకరాలు, నిజామాబాద్‌లో 12,343 మందికి 24,243 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 15,063 మంది లబ్ధిదారులకు 2,57,108 ఎకరాలు, హైదరాబాద్‌లో 10,435 మందికి 74, 958 ఎకరాల భూమిని ఇనాం కింద మొత్తం 8,05,618 ఎకరాల భూమి ని, 92, 250 మంది రైతులకు కేటాయించారు.ఈ భూములపై యాజమాన్య హక్కు పొందే వీలు లేకపోవడంతో ఆయా కొనుగోలుదారులు కంటిపై కనుకు లేకుండా పోయింది.

ఏళ్లుగా అనుభవిస్తు న్న భూమిని వదులుకోవాల్సి వస్తుందనన్న ఆందోళన కొనుగోలు చేసిన వారిలో పెరిగింది. ఇనాం రద్దు చట్టం-1955 ప్రకారం నిజాం రాజులు ఇ నాందారులకు ఇచ్చిన భూములన్నీ ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. ఇనాందారుల వారసులు, కొన్ని కేటగిరీల్లో వారికి యాజమా న్య హక్కు పత్రాలిచ్చారు. ఓఆర్సీ పొందిన కొందరు తమ అవసరాల మేరకు భూమిని విక్రయించారు. మరికొందరు ఓఆర్సీ లేకుండానే తమ ఆధీనంలో ఉన్న భూమిని అమ్మేశారు. ఆయా కొనుగోలుదారులు ఏళ్లుగా ఆ భూములను అనుభవిస్తున్నారు. ఇనాం భూములకు ఓఆర్సీ పొందేందుకు ఇనాం దారులు మాత్రమే అర్హులని హైకోర్టు పేర్కొంది. కానీ ఇప్పటికే దాదాపు 6 లక్షల ఎకరాల భూమి చేతులు మారినట్టు తెలుస్తోంది.
త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం
గతంలో పేదలకు పంచిన ఇనాం భూముల్లో ఎన్ని వారి వద్ద ఉన్నా యి, మిగతావి ఎవరి వద్ద ఉన్నాయి, ఆ భూములను ఎప్పుడు అమ్ముకున్నారు తదితర విషయాలను అధ్యయనం చేసిన అన్ని జిల్లాల కలెక్టర్‌లు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక సమర్పించారు. వీటిపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News