- Advertisement -
న్యూఢిల్లీ : భారతీయ వైమానిక దళం(ఐఎఎఫ్) కోసం ఆరు డోర్నియర్ విమానాలను కొనుగోలు చేసేందుకు గాను హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఎఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.667 కోట్లు ఉంటుంది.
ఈ ఆరు విమానాల కొనుగోలుతో మారుమూల ప్రాంతాల్లో ఐఎఎఫ్ సామర్థం మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. డోర్నియర్ 228 ఎయిర్‌క్రాఫ్ట్ అత్యధిక బహుళ విధాలుగా వినియోగించే రవాణా విమానం ఇది. వివిధ అవసరాలు, ప్రయాణికుల రవాణాతో పాటు సముద్ర నిఘా కోసం వినియోగించనున్నారు.
- Advertisement -