Thursday, January 23, 2025

‘ఢిల్లీదే’ డీల్

- Advertisement -
- Advertisement -

ఆడియోల్లో అమిత్ షా,
బిఎల్ సంతోష్, తుషార్‌ల పేర్లు

10మంది ఎంఎల్‌ఎలే టార్గెట్

నెం.1, 2లే సూత్రధారులు

హస్తినను తాకిన ఆడియో ప్రకంపనలు

సంచలనం
సృష్టిస్తున్న

బిజెపి దూతలు,
రోహిత్ రెడ్డి
సంభాషణ

ఆడియో 1, 2లలో కుట్ర మొదటి ఆడియోలో
రాజకీయ భవిష్యత్తు, ఎంఎల్‌ఎల భేరసారాలపై రోహిత్ రెడ్డి, రామచంద్ర
భారతి స్వామీజీ మధ్య ఆసక్తికర సంభాషణలు రెండో ఆడియోలో
ఎవరెవరికి ఎంత ఇవ్వాలనే దానిపై రోహిత్ రెడ్డి, ఇద్దరు స్వామీజీలు,
నంద కూమార్‌ల మధ్య మంతనాలు మునుగోడుకు ముందే ఫిరాయిస్తే
రూ.100కోట్లు రోహిత్ రెడ్డి రాజీనామా చేస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం
కూలిపోతుంది అమిత్ షా ఎంట్రీ అయితే అన్నీ ఆయనే చూసుకుంటారు
ఉప ఎన్నిక కోసమే ఈ ఆపరేషన్ బండి సంజయ్, కిషన్ రెడ్డిలు
నామమాత్రమే అంతకంటే పెద్దవారితోనే చర్చలు ఆడియోలో బిజెపి
ఏజెంట్ల అభయం లోకల్ లీడర్లకు తెలియకుండానే చేస్తామని హామీ
నేడు విడుదల కానున్న వీడియోలు

దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారం కమలనాథుల మెడకు మరింత బిగుసుకుంటున్నది. బిజెపి దూతలుగా భావిస్తున్న ముగ్గురు ఏజెంట్లకు, తాండూరు ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్ రెడ్డికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులు కుట్ర కోణాలను ఆవిష్కరిస్తున్నాయి. ఆడియో రికార్డులు, రిమాండ్ రిపోర్టులో కోర్టుకు సమర్పించిన సాక్షాలు బిజెపి పాత్రపై అనుమానాలను మరింత పెంచుతున్నాయి. హోం మంత్రి అమిత్ షా, కర్నాటక నేత బిఎల్ సంతోష్, తుషార్, సునీల్ కుమార్ బన్సాల్ పేర్లు వీటిలో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు నేడు మరిన్ని విడుదల కానున్నట్లు సమాచారం. ఆడియో రికార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిందితులకు ఎసిబి కోర్టు రిమాండ్ నిరాకరించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా పడింది.

ఆడియో 1

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కుట్ర వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటనకు సంబంధించినవని చెబుతూ బయల్పడిన ఆడియో సంభాషణలు తీవ్రస్థాయిలో కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఢిల్లీ పెద్దల డైరెక్షన్‌లోనే డీల్ కుదుర్చుకోవాలని మాట్లాడినట్లు ఆడియో సంభాషణలు స్పష్టం చేశాయి. తాండూరు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పైలెట్ రోహిత్‌రెడ్డి, సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వెలుగు చూసింది. ఇందులో రాజకీయ భవిష్యత్తు, ఎంఎల్‌ఎల బేరసారాలకు సంబంధించిన అంశా లు చర్చకు వచ్చాయి. ఆడియోలో ఒకరిని ఒకరు పలకరించుకున్న తర్వాత ఫోన్లో మాట్లాడటం కాకుండా డైరెక్ట్‌గా కలవటంపై మాట్లాడారు. హైదరాబాద్ కాకుండా ఇతర ప్రాంతాల్లో కలుద్దామని రామచంద్రభారతి చెప్పారు.

ఇందుకు ఎంఎల్‌ఎ రోహిత్ రెడ్డి స్పందిస్తూ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అందరూ అక్కడే ఉన్నారని, ఇక్కడే కలుద్దామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్న క్రమంలో తన మీద కెసిఆర్ నిఘా పెట్టారని, మనం కలవడానికి హైదరాబాద్ మంచి ప్లేస్ అని రోహిత్‌రెడ్డి తెలిపారు. నవంబర్ 25 తర్వాత తాను హైదరాబాద్‌కు వస్తానని, ఆ రోజు కూర్చొని ఫైనల్ సెటిల్‌మెంట్ చేసుకుందామం టూ రామచంద్రభారతి చెప్పినట్లుగా ఆడియో కాల్‌లో ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఇడి నుంచి ఐటి వరకు తాము చూసుకుంటామని, భద్రతా పరంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ రోహిత్‌రెడ్డికి రామచంద్రభారతి హామీ ఇచ్చారు. ఇంకా ఎక్కువ మంది ఎంఎల్‌ఎలు ఉం టే బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హైదరాబాద్ వస్తారంటూ రామచంద్రభారతి స్వామీజీ చెప్పినట్లు ఉంది.

వచ్చే ఎంఎల్‌ఎల పేర్లు చెప్పమని స్వామీజీ అడగగా వారి పేర్లు చెప్పలేనని రోహిత్‌రెడ్డి బదులిచ్చారు. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలంటూ రోహిత్‌రెడ్డి కోరగా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, తాము జాగ్రత్తలు తీసుకుంటామంటూ రామచంద్రభారతి తెలిపినట్లు ఆడియోలో ఉంది. ఈ విషయం తమ సిఎం కెసిఆర్‌కు తెలిస్తే మా పని అయిపోతుందంటూ రోహిత్‌రెడ్డి చెప్పగా.. మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుం డా తాము చూసుకుంటామని రామచంద్రభారతి తెలిపారు. బిఎల్ సంతోష్ అన్నీ నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. నెంబర్ 1, నెంబర్ 2 బిఎల్ సంతోష్ ఇంటికి వచ్చి అన్నీ చర్చిస్తారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంటది. బిఎల్ సంతోష్‌తో కలిసి మనం నెంబర్ 2 దగ్గరకు వెళదాం.. ఒకరిద్దరం ముందుగా వస్తే బాగుంటుంది. 25న గ్రహణం ఉంది కాబట్టి ఆ తర్వాత కలుద్దాం. నేను డైరెక్గ్‌గా బిఎల్ సంతోష్‌తోనే మాట్లాడతా.. నాకు మధ్యవర్తులు ఎవరూ లేరు’ అని రామచంద్రభారతి స్వామీజీ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆడియోలు టిఆర్‌ఎస్ అధికార ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశారు.

ఆడియోలో కీలక అంశాలు…

రామచంద్ర భారతి స్వామీజీ : బిజెపిలోకి రావడానికి నేను క్లియర్ చేస్తాను. నెంబర్ 1, 2 స్థానాల్లోని వ్యక్తులతో నేను మాట్లాడిస్తాను. ఇడి దాడులు జరగకుండా అన్నీ చూసుకుంటా.
రామచంద్రభారతి : హైదరాబాద్‌లో కాకుండా మరో ప్రాంతంలో డైరెక్ట్‌గా కలుద్దాం
పైలెట్ రోహిత్‌రెడ్డి : నాతో పాటు మరో ఇద్దరు ఎంఎల్‌ఎలు వస్తారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లో చర్చిద్దాం. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నాపై నిఘా ఉంది. హైదరాబాద్ అయితే సేఫ్‌గా ఉంటుంది.
రామచంద్రభారతి : వచ్చే వార్ల పేర్లు చెప్పండి
పైలెట్ రోహిత్‌రెడ్డి : నాతో పాటు వచ్చే ఇద్దరు ఎంఎల్‌ఎల పేర్లను నెంబర్ 2 ముందు కూర్చున్నప్పుడు రివీల్ చేస్తాను. సారీ.. ప్రస్తుతం చెప్పలేను స్వామీజి.
రామచంద్రభారతి స్వామీజీ : బిజెపి ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ జీ డిసైడ్ చేస్తారు. నెంబర్ 1, నెంబర్ 2 సంతోష్ ఇంటికే వస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రోటోకాల్ ప్రకారం అన్నీ నడుస్తుంటాయ్.
రామచంద్రభారతి : మొదట ఒకరిద్దరం కలుద్దాం. 25న గ్రహణం ఉంది కాబట్టి, 26వ తేదీన కలుద్దాం.
నందూ: స్వామీజీ మ రొక్క విషయం, రో హిత్ సార్‌కు శరత్ చాలా దగ్గరి వ్యక్తి.
రామచంద్రభారతి: అరబిందో ఫార్మా శరతేనా. అది చాలా సంక్లిష్టమైన కేసు, మనం వారితో కూ ర్చొని డీల్ చేయాలి.
నందూ: స్వామీజీ మీరు వచ్చినప్పుడు వాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తాం.
రోహిత్‌రెడ్డి: నందన్న వద్దు.. నందన్నా ఈ ఫాల్స్ ప్రామిసెస్ వద్దు, స్వామీజీ ఇందులో నేను ఇన్వాల్వ్ కాను.
అతను నాకు మంచి మిత్రుడే కానీ, ప్రస్తుతానికి ఆ విషయంలో ఇన్వాల్వ్ కాలేను స్వామీజీ.
రామచంద్రభారతి: సరే, పర్వాలేదు. మనం ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిద్దాం.
రోహిత్‌రెడ్డి: థ్యాంక్యూ స్వామీజీ
రామచంద్రభారతి : థాంక్యూ…

ఆడియో 2

రెండో ఆడియో ఇలా…
ఎవరెవరికి ఎంతివ్వాలి…

రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజుల ఫోన్ సంభాషణ

మెయినాబాద్ ఫాంహౌస్‌లో ఎంఎల్‌ఎల ప్రలోభాల అంశానికి సంబంధించి రెండో ఆడియో విడుదలైంది. ఈ ఆడియోలో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌ల మధ్య సంభాషణ జరిగినట్టుగా ఉం ది. ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలనే దానిపై చ ర్చించుకున్నారు. నలుగురు ఎంఎల్‌ఎలు రా వడానికి సిద్ధంగా ఉ న్నారని ఈ సంభాషణ లో తేలింది. వారు 100 ఆశిస్తున్నారని ఆడియోలో ఉంది. పై లెట్ రోహిత్‌రెడ్డి తనతో పాటు నలుగురిని తీ సుకొచ్చేందుకు సి ద్ధంగా ఉన్నారని ఈ సంభాషణల్లో ఉంది. పైలెట్ రోహిత్‌రెడ్డికి 100, మిగిలిన వారికి నామమాత్రంగా ఇస్తే సరిపోతుందని ఈ సంభాషణ చెబుతోంది. రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దలను కలిపిస్తామని చెప్పామని ఆడియోలో ఉంది. 27 నిమిషాల పాటు ఈ సంభాషణ కొనసాగింది. మునుగోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇది జరిగిపోతుందని రామచంద్రభారతి అన్నట్లుగా ఈ సంభాషణ ఉంది.

మునుగోడు ఉప ఎన్నికలకు ముందే అయితే 100కు రావడానికి వాళ్లు ఓకే అం టున్నారని చర్చించుకున్నట్లుగా ఉంది. ఈ అంశాలపై తాను బిఎల్ సంతోష్‌కు మెసేజ్ చేస్తానని రామచంద్రభారతి అన్నట్లుగా ఆడియోలో ఉంది. ఈ విషయమై మాట్లాడి క్లారిటీ ఇవ్వాలని రామచంద్రభారతిని కోరినట్టుగా ఆడియో సంభాషణ ఉంది. నలుగురైదుగురు నేతలైతే నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లి మాట్లాడొచ్చని సంభాషణలో ఉంది. ఒకేసారి నలుగురు ఎంఎల్‌ఎలు సిద్ధంగా ఉన్నారని సంభాషణ సాగింది. ఒకరిద్దరు ఉంటే ఢిల్లీకి తీసుకురావడం వృథా అని అభిప్రాయపడినట్లుగా ఆ ఆడియోలో ఉంది.

రెండో ఆడియోలో కీలకాంశాలు…

నందు: పైలట్ రోహిత్ రెడ్డితో మాట్లాడాను. ముం దుగా వస్తే నువ్వే టీమ్ లీడ్ అవుతావని చెప్పా ను. ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందన్నాను.
రామచంద్ర భారతి : వాళ్లు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?
నందు : పైలట్ రోహిత్ రెడ్డి రూ. 100 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. మిగిలిన వారికి మరో రేటు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
రామచంద్ర భారతి: నేను పైన చెప్పేటప్పుడు రోహిత్ రెడ్డి తనతో పాటు నలుగురిని తీసుకువస్తానని చెప్తాను. రోహిత్‌ను తీసుకుంటే ఆయనతోపాటు మిగిలినవారు వస్తారు.
నందు : ఇక్కడ వ్యవస్థ సరిగ్గా లేదని పైన చెప్పండి. పైలట్ చాలా ముఖ్యమైన లీడర్ అని చెప్పండి.
రామచంద్రభారతి: పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు ఒకసారి కమిట్ అయితే తిరిగి వెనక్కి వెళ్లలేం. బండి సంజయ్, కిషన్‌రెడ్డితో కాదు ఇంకా పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం.
నందు : ఈ విషయం ఇక్కడ లోకల్ లీడర్లకు తెలియకూడదు.
రామచంద్రభారతి: మనం చేసే ఈ ఆపరేషన్ తె లంగాణ లీడర్లకు తెలియకుండా చేస్తాం. ము నుగోడు ఎన్నికల కంటే ముందు రూ.100 అడిగితే నేను పైన మాట్లాడతాను. నన్ను పైలట్ రోహిత్‌రెడ్డితో ఒకసారి మాట్లాడించండి. ఇప్పు డు ఎంత మంది రెడీగా ఉన్నారో తుషార్‌కు చె ప్పాలి. మునుగోడు ఎన్నికల కన్నా ముందు ఈ వ్యవహారం కంప్లీట్ చేయాలి. వాట్సాప్‌లో కాన్ఫరెన్స్‌లో పెడితే నేను వారితో మాట్లాడాతాను.
సింహయాజులు: 100 కిలోమీటర్ల రేడియస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు మనతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కొడంగల్, తాండూర్, చేవేళ్ల ఎమ్మెల్యేలతో ఇప్పటికే నేను మాట్లాడాను.
రామచంద్రభారతి : కేవలం ఇద్దరు ముగ్గురి కోసం దిల్లీ నుంచి వాళ్లు రావడం సరికాదు. కనీసం ఐదు, ఆరుగురు అయితే ఢిల్లీ వారిని రప్పించవచ్చు. బల్క్‌గా ఎవరైనా చేరితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది.
సింహయాజులు: రూ. 100 కావాలని పైలట్ రోహిత్‌రెడ్డి అంటున్నాడు. రాజీనామా చేయాల్సి వస్తే ప్రభుత్వంతో ఢీకొనడం అంత ఈజీ కాదంటున్నాడు.
రామచంద్రభారతి: రోహిత్ రాజీనామా చేస్తే ఒక్క నెలరోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది. దిల్లీలోనూ మేం పనిచేస్తున్నాం. 43 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.
అయితే బయటపడిన ఆడియోలు అసలువో, నకిలీవో అనే అంశం ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారిస్తారు. మరోవైపు ఈ ఆడియోలో మాట్లాడినట్లుగా చెబుతున్న సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లకు బిజెపిలో ఎలాంటి సంబంధాలున్నాయనే విషయమై కూడా తేలాలి. బిజెపి పేరుతో ఈ ముగ్గురు మాట్లాడారా? లేక వీరి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే విషయమై దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News