హైదరాబాద్‌కు చెందిన విద్యుత్ ద్వి చక్రవాహన సంస్ధ PURE EV తమ వినియోగదారుల కోసం “#HappywithPURE” పేరుతో కొత్త బ్రాండ్ లాయల్టీ ప్రచారాన్ని ప్రారంభించింది. పది వారాల పాటు జరిగే ఈ ప్రచారాన్ని ఉగాది/గుడిపడ్వా పర్వ దినాన్ని పురస్కరించుకుని ప్రారంభించగా, 31 మే 2023 వరకూ నిర్వహించనున్నారు. ఈ ప్రచారంలో పాల్గొనడం ద్వారా ప్యూర్ ఈవీ వినియోగదారులకు ఖచ్చితంగా 5వేల రూపాయల విలువైన ప్యూర్‌గిఫ్ట్ ఓచర్ గెలుచుకునే అవకాశం ఉంది. దీనితో పాటుగా వారు ఆటోమేటిక్‌గా లక్కీడ్రాలో ప్యూర్ ఈవీ సరికొత్త ఉత్పత్తులు అయిన eTryst 350, ecoDryft and ePluto 7G Pro గెలుచుకునే అవకాశం ఉంది. ఈ కంపెనీ, తమ పాత వినియోగదారులను నూతన తరపు AIS 156 సర్టిఫైడ్ సిస్టమ్‌లకు ఆధునీకరించుకునే అవకాశమూ ఉంది.
జరుగుతున్న హ్యాపీ విత్ ప్యూర్ ప్రచారం గురించి ప్యూర్ ఈవీ కో–ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రోహిత్ వదేరా మాట్లాడుతూ.. ‘‘ మేము ఇటీవల విడుదల చేసిన ఇంపాక్ట్ రిపోర్ట్ ఆధారంగా ఈ ప్రచారం తీర్చిదిద్దాము. ఈ నివేదికలో మేము పరిశీలించిన దాని ప్రకారం ఐసీఈ(ICE) ద్విచక్రవాహన వినియోగదారులు సరాసరిన ఒక రోజులో తిరుగుతున్న దాని కంటే అధికంగా ప్యూర్ ఈవీ వావాహనాల వినియోగదారులు తిరుగుతుండటంతో పాటుగా 40వేల రూపాయల వరకూ ఆదా చేయగలుగుతున్నారు. తమ రోజువారీ జీవితాలలో మమ్మల్ని భాగంగా చేసుకున్న వినియోగదారులకు కృతజ్ఞతగా ఈ ప్రయోజనాలను అందిస్తున్నాము’’ అని అన్నారు.
అంతేకాదు, మేము మా తాజా ఆవిష్కరణ ఎకోడ్రిఫ్ట్‌కు అపూర్వమైన స్పందనను అందుకున్నాము మరియు దాదాపు 5వేలకు పైగా బుకింగ్స్ జరిగాయి. భారతదేశంలో అత్యంత అందుబాటు ధర కలిగిన విద్యుత్ మోటర్‌సైకిల్‌గా ఈ ecoDryft నిలుస్తుంది. మేము మా వినియోగదారులకు ఈ మోటర్‌సైకిల్ గెలుచుకోవడంతో పాటుగా రాబోయే అల్ట్రా లాంగ్ రేంజ్ (150 కిలోమీటర్ల) విద్యుత్ స్కూటర్ ePluto 7G Pro మరియు మా ప్రీమియం విద్యుత్ మోటర్‌సైకిల్ eTryst350ను సైతం గెలుచుకునే అవకాశం అందిస్తున్నాము.
ఈ వాహనాలకు అపూర్వమైన రీతిలో, సానుకూల స్పందన లభిస్తుంది. దాదాపు 10వేల మందికి పైగా వినియోగదారులు దీనిలో పాల్గొనడానికి ఆసక్తి చూపారు. ఈప్రచారం ముగిసే నాటికి 40వేల మంది వినియోగదారులు పాల్గొనగలరని అంచనా వేస్తున్నాము. ప్యూర్ ఈవీ తమ రెండు ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా 130కు పైగా డీలర్‌షిప్‌ల వ్యాప్తంగా లభ్యమవుతుంది. 2023 చివరి నాటికి 300కు పైగా నగరాలలో తమ పాదముద్రను మరింత విస్తరించాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.