Sunday, November 17, 2024

సరికొత్త కమ్యూట్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్‌ ఎకోడ్రిఫ్ట్‌ ను విడుదల చేసిన ప్యూర్‌ ఈవీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న విద్యుత్‌ ద్విచక్ర వాహన సంస్ధ ప్యూర్‌ ఈవీ ఇప్పుడు తమ మొట్టమొదటి కమ్యూట్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్‌– ఎకోడ్రిఫ్ట్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తిని పూర్తిగా భారతదేశంలో రూపొందించడంతో పాటుగా అభివృద్ధి చేసి, తయారుచేస్తున్నారు. భారతీయ విద్యుత్‌ వాహనరంగంలో అతి ప్రధానమైన విభాగానికి ఇది ప్రాతినిధ్యం వహించనుంది. ప్రస్తుతం భారతీయ కమ్యూటర్‌ విభాగంలో ఏ విద్యుత్‌ మోటర్‌సైకిల్‌ , భారతీయ కమ్యూట్‌ విభాగపు అవసరాలను తీర్చడం లేదు. భారతదేశంలో విక్రయించబడుతున్న అన్ని మోటర్‌సైకిల్స్‌లో 80% మరియు భారతదేశంలో విక్రయించబడుతున్న మొత్తం ద్వి చక్రవాహనాలలో 50%కు ఈ విభాగం ప్రాతినిధ్యం వహిస్తుంది.

గత సంవత్సరం ప్యూర్‌ ఈవీ తమ ప్రీమియం మోటర్‌సైకిల్‌ ఈట్రిస్ట్‌ 350 (ETryst 350)ను విడుదల చేసింది. ప్రీమియం మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా దీనిని డిజైన్‌ చేశారు. ఈ ఆవిష్కరణతో, ప్యూర్‌ ఈవీ ఇప్పుడు ఒకే ఒక్క ఈవీ2డబ్ల్యు కంపెనీగా స్కూటర్ల తో పాటుగా మోటర్‌సైకిల్స్‌ను సైతం అందిస్తూ ప్రీమియం, కమ్యూటర్‌ విభాగాలను లక్ష్యంగా చేసుకుంది.

ఈ కంపెనీ, భారతదేశ వ్యాప్తంగా తమ ఔట్‌లెట్ల వద్ద టెస్ట్‌ డ్రైవ్‌ల కోసం డెమో వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త ఎకోడ్రిఫ్ట్‌ను సరసమైన మరియు ఆకర్షణీయమైన ధరలో కమ్యూట్‌ మోటర్‌సైకిల్‌ విభాగంలో విడుదల చేయనున్నారు. ఈ వాహన ధరను జనవరి 2023 మొదటి వారంలో వెల్లడించనున్నారు. బుకింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించక మునుపే అవసరమైన ఇన్వెంటరీని సమకూర్చుకోవడానికి కంపెనీ పూర్తి సన్నద్ధమైంది. ఈ వాహనాలు నాలుగు ఉత్సాహపూరితమైన రంగులు – బ్లాక్‌, గ్రే, బ్లూ మరియు రెడ్‌లో లభిస్తాయి.

పూర్తి సరికొత్త ఎకోడ్రిఫ్ట్‌ ను హైదరాబాద్‌లోని ప్యూర్‌ ఈవీ యొక్క టెక్నికల్‌ , తయారీ కేంద్రం వద్ద రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు. ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఇంటర్నెల్‌ కంబషన్‌ ఇంజిన్‌ ( ఐసీఈ ) మోటర్‌బైక్‌లకు సమానంగా సవారీ అనుభవాలను అందించనుంది. ఒక్కసారి బ్యాటరీ పూర్తిగా చార్జ్‌ చేస్తే 135 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ వాహనం లో 3.0 కిలోవాట్‌ హవర్‌ పేటెంటెడ్‌ మరియు ఏఐఎస్‌ సర్టిఫైడ్‌ బ్యాటరీ ఉంది. దీనిని ప్యూర్‌ ఈవీ అభివృద్ధి చేసింది.

ఈ మొత్తం ఉత్పత్తి ఇంజినీరింగ్‌ అత్యంత స్ధిరమైన, సౌకర్యవంతమైన సవారీ అనుభవాలను గంటకు 75 కిలోమీటర్ల వేగంతో అందిస్తుంది. కమ్యూట్‌ ఐసీఈ మోటర్‌సైకిల్స్‌కు ధీటుగా మృదువైన సవారీని ఇది అందించనుంది.

అభవృద్ధి చేసిన ఉత్పత్తిలో సాంకేతిక అంశాలను గురించి డాక్టర్‌ నిశాంత్‌ దొంగరి, ఫౌండర్‌, ప్యూర్‌ ఈవీ మరియు అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఐఐటీ హైదరాబాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ కమ్యూట్‌ మోటర్‌సైకిల్‌ ఆవిష్కరణ ఓ గేమ్‌ ఛేంజర్‌గా నిలువనుంది, అంతేకాదు మా ఆర్‌ అండ్‌ డీ కేంద్రం వద్ద పవర్‌ట్రెయిన్‌ డిజైన్‌ మరియు అభివృద్ధి పరంగా ప్యూర్‌ ఈవీ యొక్క అభ్యాసాలను సైతం ప్రదర్శించనుంది, ఈ కంపెనీ యొక్క కీలకమైన ఆర్‌ అండ్‌ డీ కార్యకలాపాలను ఓ సగటు భారతీయ వినియోగదారుని అంచనాలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తుంటాము. సాధారణంగా వీరు కమ్యూట్‌ మోటర్‌సైకిల్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇది వారి రోజువారీ అవసరాలను సౌకర్యం మరియు విశ్వసనీయత పరంగా ఎలాంటి రాజీలేకుండా అందిస్తుంది’’ అని అన్నారు.

డాక్టర్‌ నిశాంత్‌ దొంగరి మాట్లాడుతూ ‘‘మేము విస్తృత స్ధాయిలో ట్రయల్స్‌ మరియు టెస్టింగ్‌ను ఈ ప్రొడక్ట్‌ కోసం చేస్తున్నాము. ప్రస్తుతం అందుబాటులోని ఐసీఈ మోటర్‌సైకిల్స్‌ యొక్క పనితీరుతో పోల్చినప్పుడు, ఎకోడ్రిఫ్ట్‌ మెరుగైన పనితీరు కనబరచగలదనే విశ్వాసంతో ఉన్నాము. అంతేకాదు వినియోగదారులు ఈవీల దిశగా మారేందుకు ఇది తోడ్పడనుంది. ఎందుకంటే, ఐసీఈ ద్విచక్ర వాహన విక్రయాలు కమూటర్‌ మోటర్‌సైకిల్‌ విభాగాలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది కంపెనీకి మాత్రమే కాదు, దేశపు ఈవీ స్వీకరణ లక్ష్యంకు సైతం తోడ్పడనుంది’’ అని అన్నారు.

భారతదేశంలో మోటర్‌సైకిల్స్‌ అత్యంత ప్రాచుర్యం పొందాయి మరియు వ్యక్తిగత ప్రయాణాలకు సంబంధించి ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన రవాణా మార్గంగా కూడా ఇవి వెలుగొందుతున్నాయి. వ్యక్తిగత మొబిలిటీలో దాదాపు 65% మార్కెట్‌ వాటా వీటిదే ఉంటుంది. దీనిలోనూ 75% మార్కెట్‌ వాటా కమ్యూట్‌ లేదా మాస్‌ సెగ్మంట్‌ మోటర్‌సైకిల్స్‌ విభాగాలలో ఉంది. ఈ విభాగమే స్మార్ట్‌, ఖర్చు పట్ల అప్రమప్తతతో ఉండే, విశ్వసనీయత కోరుకునే భారతీయ వినియోగదారులను ముందుకు నడుపుతుంది. భారతదేశ వ్యాప్తంగా వినియోగ పరిస్ధితులను పరిగణలోకి తీసుకుంటే, ప్రీమియం మోటర్‌సైకిల్స్‌తో పోలిస్తే ఆధారపడతగిన, సమర్థవంతమైన పవర్‌ట్రైన్‌ కమ్యూట్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్‌ లో కావాల్సి ఉంటుంది. పవర్‌ ట్రైన్‌ డిజైన్‌లో ప్యూర్‌ ఈవీ యొక్క నైపుణ్యం కారణంగా విద్యుత్‌ స్కూటర్‌తో పాటుగా ప్రీమియం మోటర్‌ సైకిల్‌ మార్కెట్‌లో విజయం సాధించింది. ఇప్పుడు కమ్యూట్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌ సైకిల్‌ ప్యూర్‌ ఈవీ కి మరో ముందడుగు.

ఎకోడ్రిఫ్ట్‌ ఆవిష్కరణతో ప్యూర్‌ ఈవీ యొక్క ప్రణాళికలను గురించి ప్యూర్‌ ఈవీ స్టార్టప్‌ కో–ఫౌండర్‌ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీ రోహిత్‌ వదేరా మాట్లాడుతూ ‘‘ మా పెర్‌ఫార్మెన్స్‌ మోటర్‌సైకిల్‌ ఈట్రైస్ట్‌ 350 విడుదలతో అపూర్వ స్పందనను మేము అందుకున్నాము మరియు మా కంపెనీ వృద్ధిలో అత్యంత ప్రధానమైన మైలురాయిగా ఎకోడ్రిఫ్ట్‌ విడుదల నిలువనుంది. ఈ ఆవిష్కరణతో, మేము ఇప్పుడు భారతదేశంలో ఒకే ఒక్క విద్యుత్‌ ద్విచక్రవాహన సంస్థగా విస్తృత శ్రేణిలో స్కూటర్లు, మోటర్‌ సైకిల్స్‌ విభాగంలో కలిగి ఉన్నాము. మరింత ముందుకు వెళ్తే, మేము బ్రాండ్‌ బిల్డింగ్‌ పట్ల అధికంగా దృష్టి సారించాము మరియు ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో నూతన వెర్షన్స్‌ను విడుదల చేయనున్నాము. కమ్యూట్‌ మోటర్‌సైకిల్‌ వినియోగిస్తున్న వాహన వినియోగదారులతో పోల్చినప్పుడు వాహనం కొనుగోలు ధర (టీసీఓ) పోటీతత్త్వంతో ఉంది. మేము స్ధిరంగా మా అమ్మకాలు మరియు అమ్మకం తరువాత సేవల నెట్‌వర్క్‌ను ఆధునీకరించడంపై దృష్టి సారించాము, ఎందుకంటే అది ఆటోమొబైల్‌ పరిశ్రమలో అత్యున్నత విక్రయాలు మరియు బ్రాండ్‌ లాయల్టీకి అత్యంత కీలకమిది’’అని అన్నారు.

ఈ మోటర్‌సైకిల్‌లో వినూత్న అంశం ఏమిటంటే, పేటెంటెడ్‌ మరియు ఏఐఎస్‌ 156 సర్టిఫైడ్‌ బ్యాటరీ. దీనిని అత్యంత కఠినమైన పర్యావరణ పరిస్ధితులలో సైతం సమర్థవంతంగా పనిచేసేలా తీర్చిదిద్దాము. ఎకోడ్రిఫ్ట్‌ను కమ్యూటర్‌ మోటర్‌సైకిల్‌గా అభివృద్ధి చేశాము.అందువల్ల విభిన్నమైన భారతీయ భూభాగాలలో సైతం సమర్ధవంతంగా పనిచేయగలదు. ఈ కంపెనీ ప్రధానంగా భారతదేశంలో ఎక్కువగా విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన మరియు సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను సరసమైన ధర వద్ద ఇష్టపడే వారిని లక్ష్యంగా చేసుకుంది.

భారతదేశ వ్యాప్తంగా పట్టణాలు, నగరాలలో ప్యూర్‌ ఈవీ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే తమ ఉత్పత్తులను దక్షిణాసియాకు ఎగుమతి చేయడంతో పాటుగా దక్షిణ అమెరికన్‌ మరియు ఆఫ్రికా మార్కెట్‌లకు సైతం విస్తరించేందుకు ప్రణాళిక చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News