Wednesday, January 22, 2025

విద్యుత్‌ మోటర్‌సైకిల్‌ ప్యూర్‌ ఈవీ ఎకోడ్రిఫ్ట్‌ డెలివరీలు ప్రారంభమయ్యాయి

- Advertisement -
- Advertisement -

ప్యూర్‌ ఈవీ తమ తాజా కమ్యూట్‌ ఎలక్ట్రిక్‌ మోటర్‌సైకిల్‌, ఎకో డ్రిఫ్ట్‌ డెలివరీలను వెల్లడించిన సమయానికంటే ముందుగానే ప్రారంభించింది. తొలి విడత డెలివరీలను హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని తమ డీలర్‌షిప్‌ ఔట్‌లెట్ల వద్ద చేసింది . భారతదేశ వ్యాప్తంగా తమ ఔట్‌లెట్ల వద్ద స్టాక్స్‌ను కంపెనీ అందుబాటులో ఉంచడంతో పాటుగా డెలివరీలను అత్యంత శుభప్రదమైన ఉగాది/పడ్వా రోజున అంటే 22 మార్చి 2023న చేయనుంది.

నూతన ఎకోడ్రిఫ్ట్‌ తొలి యజమాని శ్రీ నాగేంద్ర రావు మాట్లాడుతూ ‘‘ ప్రస్తుతం పెట్రోల్‌ మోటర్‌సైకిల్‌ వాహన యజమానిగా, నా బడ్జెట్‌కు సరిపోతూనే 100 కిలోమీటర్ల దూరం ఒక్క చార్జింగ్‌తో ప్రయాణించగల మోటర్‌సైకిల్‌ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. ఎకోడ్రిఫ్ట్‌ విడుదల గురించి నేను ఫిబ్రవరి లో విన్న వెంటనే, దగ్గరలోని డీలర్‌షిప్‌ (ఈ డ్రైవ్‌ మోటర్స్‌, హైదరాబాద్‌)కు వెళ్లి, టెస్ట్‌ డ్రైవ్‌ చేశాను. వెంటనే ఫిబ్రవరిలోనే ఈ వాహనాన్ని బుక్‌ చేసుకుని, మార్చిలో వాహనాన్ని వెంట తీసుకుని వెళ్తున్నాను’’ అని అన్నారు.

ఎకోడ్రిఫ్ట్‌ మోటర్‌సైకిల్‌ను 99,999 రూపాయలలో ప్రారంభోత్సవ ధరగా గత నెల ప్యూర్‌ విడుదల చేసింది. ప్యూర్‌ వెల్లడించే దాని ప్రకారం, గరిష్ట వేగం గంటకు 75కిలోమీటర్లతో ప్రయాణిస్తే, మూడు డ్రైవింగ్‌ మోడ్స్‌లో 130 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ డ్రైవ్‌ – ట్రైన్‌లో ఏఐఎస్‌ 156 సర్టిఫైడ్‌ 3.0 కిలోవాట్‌ హవర్‌ బ్యాటరీ,స్మార్ట్‌ బీఎంఎస్‌ మరియు బ్లూ టూత్‌ కనెక్టివిటీ, 3కిలోవాట్‌మోటర్‌, క్యాన్‌ ఆధారిత చార్జర్‌, కంట్రోలర్‌ మరియు ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ వంటివి ఉండటం చేత భవిష్యత్‌లో ఫర్మ్‌వేర్‌ సైతం అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు.

ఎకోడ్రిఫ్ట్‌ డెలివరీలను ప్రారంభించామని ప్యూర్‌ ఈవీ కో–ఫౌండర్‌ మరియు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీ రోహిత్‌ వదేరా మాట్లాడుతూ ‘‘మేము అపూర్వ స్పందన అందుకున్నాము మరియు వ్యక్తులు, సంస్ధలు, డెలివరీ ఏజెన్సీలు మరియు ఆఖరకు ప్రభుత్వ సంస్థల నుంచి కూడా ఎకో డ్రిఫ్ట్‌కు సానుకూల స్పందన చూశాము. ఇప్పటి వరకూ 10వేలకు పైగా బుకింగ్స్‌ అందుకున్నాము మరియు మే చివరి నాటికి వీటిలో సగానికి పైగా బైక్‌లను డెలివరీ చేయడంతో పాటుగా జులై నాటికి మిగిలిన 50 % డెలివరీలను ప్రారంభించనున్నాము.

మేము బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, మిడిల్‌ఈస్ట్‌, దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్‌ నుంచి కూడా ఎంక్వైరీలను అందుకున్నాము. ఇది మాకు విస్తృతశ్రేణిలో విస్తరించేందుకు తగిన ప్రణాళికలను అందించింది. దేశంతో పాటుగా అంతర్జాతీయంగా విస్తరించేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నాము’’ అని అన్నారు.

ప్యూర్‌ ఈవీ తమ ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఇవి తమ 130కు పైగా ఎక్స్‌క్లూజివ్‌ డీలర్‌షిప్స్‌ వ్యాప్తంగా భారతదేశంలో లభిస్తున్నాయి. ఈ కంపెనీ మరింతగా తమ కార్యకలాపాలను 300 నగరాల వ్యాప్తంగా 2023 సంవత్సరాంతానికి విస్తరించడానికి ప్రణాళిక చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News