Wednesday, November 13, 2024

పక్కా లోకల్

- Advertisement -
- Advertisement -

కొత్త మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే

మనతెలంగాణ/హైదరాబాద్:  వైద్య కళాశాలల్లో తెలంగాణ స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనని ఇటీవల ప్రభు త్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆలిండియా కోటాలో 15 శాతం పోగా.. మిగిలినవన్నీ తెలంగాణ వారికేనని ప్రభుత్వం ఇటీవల జిఒ 72ను జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మంజూరైన వైద్య కళాశాలల్లో 85 శాతం సీట్లు తెలంగాణ వారికేనని అందులో స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన జిఒ 72ను సవాల్ చేస్తూ ఆంధప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన న్యా యస్థానం వాటిని కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే
తెలంగాణలో 2014 జూన్ తర్వాత కాంపిటీటివ్ అథారిటీ(కన్వీనర్ కోటా) కోటాలోని 100 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తున్నట్లు జులై 5న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల ఆడ్మిషన్ నిబంధనలు- 2017ను సవరిస్తూ ఆ శాఖ కా ర్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేసి, నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 371-డి నిబంధనల ప్రకారం ప్రవేశ నిబంధనలను సవరించినట్లు వివరించారు. ఇదివరకు ఉన్న నిబంధనల ప్రకారం వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లలో.. 85 శా తం కాంపిటీటివ్ అథారిటీ కోటా కాగా.. మిగతా 15 శాతం అన్ రిజర్వుడ్ విభాగానికి చెందుతాయి. పునర్విభజన చట్టం నేపథ్యంలో ఈ సీట్లకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులూ పోటీపడుతున్నారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటైన 36 మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లన్నింటినీ 100 శాతం తెలంగాణ విద్యార్థులకే కేటాయించనున్నారు. ప్రభు త్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు 520 ఎంబిబిఎస్ సీట్లు అదనంగా లభించనున్నాయి.

పెరిగిన ఎంబిబిఎస్ సీట్లు
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి మొత్తం 20 కళాశాలలు ఉండగా.. వాటిలో 2,850 ఎంబిబిఎస్ సీట్లు ఉండేవి. అందులో కన్వీనర్ కోటా కింద ఉన్న 1,895 సీట్లలో 15 శాతం (280 సీట్లు) ఉమ్మడి కోటా కింద అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పో టీ పడేవారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో వైద్య కళాశాలల సంఖ్య 56కు చేరుకోగా..ఎంబిబిఎస్ సీట్లు 8,440కి పెరిగాయి. పాత విధానమే కొనసాగితే కొత్తగా ఏర్పాటైన 36 వైద్య కళాశాలల్లోనూ 15 శాతం ఉమ్మడి కో టాను అమలు చేయాలి. దీనివల్ల తెలంగాణ విద్యార్థులు నష్టపోతారని గుర్తించిన ప్రభుత్వం.. ఉమ్మడి కోటాను పాత 20 కాలేజీలకే పరిమితం చేస్తూ నిబంధనలను సవరించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన 36 కాలేజీల్లోని కన్వీనర్ కోటా అథారిటీ) కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News