Monday, December 23, 2024

46 ఏళ్ల తర్వాత తెరచుకున్న పూరీ జగన్నాథుని రత్న భాండాగారం

- Advertisement -
- Advertisement -

గోపాల్ పూర్: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి భాండాగారం నేడు తెరుచుకుంది. పూజల తర్వాత మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరిచారు. 11 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. ఒడిశా ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యుడు సిబికె మహంతి, ఆలయ పాలనాధికారా అరవింద పాడి, పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, పురావస్తు శాఖ ఇంజనీర్ ఎన్ సి. పాల్, పూరీ రాజ ప్రతినిధితో సహా ఐదుగురు ఆలయ సేవకులు వీరిలో ఉన్నారు.

ఇదివరలో ఈ రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల క్రితం 1978లో తెరిచారు. ఈసారి లెక్కింపు తర్వాత జగన్నాథుని ఆభరణాల విలువ అంచనా వీలవ్వగలదు. అభరణాల లెక్కింపు ప్రక్రియనంతా ఒడిశా ప్రభుత్వం డిజిటలైజేషన్ చేయనున్నది. ఇప్పుడు పూరీలో రథయాత్ర జరుగుతోంది. అయితే ఆభరణాల లెక్కింపుకు ఎన్ని రోజులు పడుతుందన్నది అధికారులు చెప్పలేకపోతున్నారు. పూర్వం మూడు లేక ఐదేళ్లకోసారి సంపద లెక్కించేవారు. చివరిసారి 1978లో లెక్కించినప్పుడు 70 రోజులు పట్టింది.

2019 ఏప్రిల్ 6న  పదమూడు మందితో కూడిన అధ్యయన సంఘం వెళ్లగా తాళం చెవి కనిపించలేదు, దాంతో వారు లెక్కించకుండానే వెనుకకు మళ్లారు. ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమటీని నియమించింది. దాంతో డూప్లికేట్ తాళపు చెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉందని గుర్తించారు. కాగా రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. బిజెపి ఆ వైఫల్యాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News