యుపిలో ఎస్పి యువజన విభాగం నాయకుల అరెస్టు
సంభల్(యుపి): ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సందర్శించిన ప్రదేశాలను సమాజ్‌వాది పార్టీకి చెందిన యువజన కార్యకర్తలు గంగాజలంతో ”శుద్ధి” చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాజ్‌వాది పార్టీ యువజన సభ రాష్ట్ర అధ్యక్షుడు భవేష్ యాదవ్, మరో 8-10 మందిపై కేసు నమోదు చేశామని, యాదవ్‌ను అరెస్టు చేశామని జిల్లా ఎస్పి చక్రేష్ మిశ్రా విలేకరులకు గురువారం తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత మంగళవారం సంభల్ జిల్లాలోని కైలా దేవిలో రూ. 275 కోట్ల విలువైన ప్రాజెక్లుకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. మరుసటి రోజున యాదవ్‌తోపాటు యువజన సభ కార్యకర్తలు ముఖ్యమంత్రి పాల్గొన్న బహిరంగ సభ వేదిక, హెలిపాడ్‌ను గంగాజలం చల్లి శుద్ధి చేశారు. ఆదిత్యానాథ్ నగరంలో ఉండి కైలా దేవి ఆలయాన్ని సందర్శించకుండా అమ్మవారిని అవమానింనినందుకు తాము ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టామని యాదవ్ ఆ సందర్భంగా విలేకరులకు తెలిపారు.