Sunday, December 22, 2024

విద్యుదాఘాతానికి పూరిల్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

కరకగూడెం : కరకగూడెం మండలం వట్టం వారి గుంపు గ్రామపంచాయతీలో గల ఎస్సీ కాలనీలో మధ్యాహ్న సమయంలో బోడ రాము తండ్రి నారాయణ (లేటు) విద్యుత్ ఘాతానికి పూరిల్లు పూర్తిగా దగ్ధం అయిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు, పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాయం నరసింహారావు, ఆర్‌ఐ రాజు పరిశీలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.

నిర్ధారణ సమయంలో రాము ఇంట్లో నిద్రిస్తూ ఉండగా విద్యుత్ ఘాతం తగిలి నిప్పులు రాలి ఇల్లు కాలిపోతుండగా చుట్టుపక్కల వారు చూసి ఇంట్లో నిద్రిస్తున్న రాముని బయటకు తీసుకువచ్చారు. ప్రజలు మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలు తప్ప ఏమి మిగలలేదని బోడ రాము దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇంట్లో పదివేల రూపాయలు నగదు ఉండగా టీవీ, కూలర్, బీరువా, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమైందని అధికారులు తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫున 50 కేజీల బియ్యం పేద కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో అరేం సాంబ, ఉప సర్పంచ్ ఎర్ర శైలజ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News