మండలంలోని పెద్ద నల్లబల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మూడు పూరిల్లు పూర్తిగా కాలి దగ్దమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే కనితి నాగమణి, భూక్య లక్ష్మయ్య , రెడ్డి వెంకన్న, అనే మూడు కుటుంబాల ఇల్లులు కాలిపోవడంతో కట్టుబట్టలతో రోడ్డుమీద నిరాశ్రులైనారు. ఎజెన్సీ ప్రాంతంలో చాలావరకు గడ్డి ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఎండాకాలం కావున ప్రభుత్వం దుమ్ముగూడెం మండలానికి ఒక ఫైర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. కనీసం అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఈ నాలుగు నెలలు సీజన్ వరకు అయినా ఫైర్ స్టేషన్ మండలంలో ఉండే విధంగా చూస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద పివి చారిటబుల్ ట్రస్ట్ విజయవాడ వాస్తవ్యులు పదివేల రూపాయలు అందజేశారు. ఆ నగదును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమాచినేని వినీల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి మీడియా, కమ్యునికేషన్, జిల్లా కన్వినర్ కనుబుద్ది దేవా, మండల ఉపాధ్యక్షులు, తెల్లం హరికృష్ణ, మాజీ సర్పంచ్ మట్టా శివాజీ, మండల యూత్ ప్రెసిడెంట్ సిద్ది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.