Monday, December 23, 2024

బాలికపై అఘాయిత్యం… మర్మాంగాల్లోకి ఇసుక, మట్టిని నింపి..

- Advertisement -
- Advertisement -

పాట్నా: పది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి అనంతరం మర్మాంగాల్లోకి ఇసుక, మట్టిని బలవంతంగా తోసిన సంఘటన బిహార్ రాష్ట్రం పుర్నియా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… డగరౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలిక (10) తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. ఇక్కడ ఆటలు ఆడవద్దని ఇండ్లలోకి వెళ్లాలని ఓ వ్యక్తి సూచించాడు. ఒక బాలికను గ్రామ శివారులో ఉన్న ఇసుక ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలిక మర్మాంగాల్లోకి ఇసుక, మట్టిని బలవంతంగా తోశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయింది. తన కూతురు కనిపించడంలేదని బాలిక తల్లి వెతుకుతోంది. ఒక వ్యక్తి బాలికను తీసుకెళ్లాడని చెప్పడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. గ్రామ శివారులో బాలిక కనిపించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకోవడానికి గ్రామస్థులు ప్రయత్నించడంతో అతడు తప్పించుకున్నాడు. పోలీసులు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌పి ఆమీర్ జువైడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News