Friday, December 20, 2024

ముంబయి విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Pushback tow tug catches fire at Mumbai Airport

 

ముంబయి: ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం 10 :45 సమయంలో విమానాలను లాగే వాహనం(పుష్‌బ్యాక్ టవ్‌టగ్) మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో అది ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఎఐ647 ఎయిర్ ఇండియాకు కొన్ని మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఆ విమానానికి ఇంధనం నింపిన అనంతరం కొద్ది దూరంలో అగ్ని ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలోని సిబ్బంది వెంటనే మంటల్ని ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. విమానానికి ఎలాంటి నష్టమూ జరగలేదని, ఎవరూ ఈ సంఘటనలో గాయపడలేదని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, 85మందితో జామ్‌నగర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News