- Advertisement -
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సిఎం పుష్కర్‌సింగ్ థామి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్నట్టు చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వేళ తమ పార్టీ విజయం సాధించి అధికారం చేపడితే ఉమ్మడి పౌర స్మృతి తీర్మానం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. వివాహాలు, విడాకులు, భూమి, ఆస్తి తగాదాలు మతాలతో సంబంధం లేకుండా ఏకీకృతంగా రూల్స్ ఉండే రీతిలో ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురానున్నట్టు పుష్కర్ సింగ్ చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌తో రాష్ట్ర ప్రజలందరికీ సమాన హక్కులు లభిస్తాయని తెలిపారు. ఉమ్మడిపౌర స్మృతితో సామాజిక సామరస్యత పెరుగుతుందని, లింగ సమన్యాయం జరుగుతుందని, మహిళా సాధికారత సాధించవచ్చని, సాంస్కృతిక, ఆధ్యాత్మిక , పర్యావరణ ఐడెంటిటీని రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.
- Advertisement -