Monday, December 23, 2024

ఓడిపోయినా…ఆయనే మళ్లీ సిఎం

- Advertisement -
Dhami
ధామీకి మళ్లీ ఛాన్స్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణం చేయనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన మాత్రం ఓటమి పాలయ్యారు. దాంతో ముఖ్యమంత్రి ఎవరవుతారనే సందేహం తలెత్తింది. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన రక్షణ మంతిర రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్ బిజెపి నేతలతో, కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలతో చర్చించారు. కాగా నేడు సమావేశమైన బిజెపి ఎంఎల్‌ఎలు ధామీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ధామీ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లో ఎంఎల్‌ఎగా నెగ్గాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు బిజెపి 47 చోట్ల గెలిచింది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News