Monday, December 23, 2024

పుష్ప2 మూవీకి భారీ క్రేజ్!

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్‌గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఇది. ఇటీవలె ఈ సినిమాలోని రెండో సాంగ్ ‘సూసేకి’ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ పాట ఎలాంటి క్రేజ్‌ను సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా ఈ పాటనే వినిపిస్తూ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లోనూ ఈ పాటకు ఫ్యాన్స్ స్టెప్పులేస్తున్నారు.

అయితే, తాజాగా పుష్ప-2లోని సాంగ్స్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రం వరల్డ్ వైడ్ సెన్సేషనల్ బిజినెస్‌ని సాధిస్తోంది. అయితే ఈ చిత్రానికి నైజాం మార్కెట్‌లో భారీ బిజినెస్ ఆఫర్ వచ్చినట్టుగా తెలిసింది. ఓ ప్రముఖ నిర్మాత పుష్ప 2 చిత్రానికి నైజం హక్కుల కొరకు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో ఈ సినిమా పట్ల క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ మ్యూజికల్ హిట్ అయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఆగస్ట్ 15న పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News