Thursday, December 12, 2024

‘పుష్ప 2’ ఊచకోత.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు..

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. విడుదలైన తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా రూ. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం 6 రోజుల్లోనే పుష్ప 2 రూ.1002 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ తాజాగా పోస్టర్ ను విడుదల చేశారు.

కాగా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది. ఇక, నార్త్ లో అయితే, ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. హిందీలోనే ఈ సినిమా దాదాపు రూ.400కోట్లు రాబట్టింది. ఇంకా పుష్ప సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ క్యూ కడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News