Wednesday, January 8, 2025

‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్‌.. చరిత్ర సృష్టించిన ‘పుష్ప 2’..

- Advertisement -
- Advertisement -

ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన ‘బాహుబలి 2’ రికార్డును ‘పుష్ప 2’ బ్రేక్‌ చేసింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప2.. తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ఈక్రమంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఇప్పట్లో సాధ్యం కాదనుకున్న రికార్డు సైతం అలవోకగా బద్దలు కొట్టేసింది. దీంతో భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప2 చరిత్ర సృష్టించింది.

ఇప్పటివరకు రూ.1810 కోట్లతో బాహుబలి 2 తొలి స్థానంలో ఉండగా.. పుష్ప2 కేవలం 32 రోజుల్లోనే రూ.1831 కోట్లు కొల్లగొట్టి ఇండియాలో నెంబర్ వన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక, ఓవరాల్ గా దంగల్ మూవీ రూ.2వేలకోట్లకు(చైనా కలెక్షన్స్) పైగా మొదటిస్థానంలో ఉండగా.. పుష్ప 2 రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లో మంచి కలెక్షన్స్ రాబడుతూ రన్ అవుతోంది. మరి, ముందు ముందు ఇంకెన్నీ రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News