ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ మూవీ ఈవెంట్స్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. విడుదలకు మరో రెండు రోజులో ఉండటంతో ఇప్పటికే ఆన్ లైన్ ప్రీ బుకింగ్స్ ప్రారంభించారు. దీంతో వరల్డ్ వైడ్ గా ప్రీ సేల్ బుకింగ్స్‌లో ఈ సినిమా సత్తా చాటుతోంది.
కేవలం 24 గంటల్లో హిందీ వెర్షన్‌లో లక్షకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో నార్త్ ప్రీ సేల్స్ బుకింగ్స్ లో ‘పుష్ప2’ ఆల్ టైమ్ టాప్3 లిస్ట్‌లోకి చేరింది. దీంతో నార్త్ ఇండియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్ టార్గెట్ గా బరిలో దిగుతోంది. మరి విడుదలైన తర్వాత పుష్పరాజ్ సత్తా చాటుతాడా? లేక యావరేజ్ గా నిలిచిపోతాడో చూడాలి.