Sunday, December 22, 2024

పుష్ప 2 ఐటమ్ సాంగ్ ఫోటో లీక్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా ‘ఫుష్ప 2’. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు మేకర్స్.

ఈ స్పెషల్ సాంగ్ లో శ్రీలీల బన్నితో ఆడిపాడనుంది. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో శ్రీలీల, అల్లు అర్జున్‌ ఇద్దరు కనిపించారు. శ్రీలీల గ్లామరస్ తో కట్టిపడేస్తున్నంది. ‘కిస్సిక్’ అంటూ ఈ ఐటెమ్ సాంగ్ సాగ‌నుంద‌ని ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News