‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ‘పుష్ప’ చిత్రంలో ఫహద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. మలయాళ నటుడే అయినా తెలుగులోనూ ఆయన మంచి గుర్తింపును అందుకున్నారు. మంగళవారం ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘పుష్ప 2 ద రూల్’ నుంచి కొత్త పోస్టర్‌తో తనకు బర్త్ డే విషెస్‌ను అందజేశారు దర్శక నిర్మాతలు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఫహద్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.అలాగే ఈ చిత్రంలో ఫహద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియజేశారు మేకర్స్. ‘ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోడానికి వస్తున్నాడు’ అంటూ ఫహద్ ఫాజిల్ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.
Also Read: రైలు కింద పడి యువ దంపతుల ఆత్మహత్య
’పుష్ప ది రైజ్’ లో అల్లు అర్జున్, ఫహద్ మధ్య పోటాపోటీగా సాగే సీన్స్.. ‘పుష్ప-2 దిరూల్’పై అంచనాలు పెంచాయి. అలాగే ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే కాన్సెప్ట్ వీడియో కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. పాన్ ఇండియా చిత్రంగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.