Wednesday, January 22, 2025

‘పుష్ప’ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , హీరోయిన్ రష్మిక మందన్న పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ క్రేజ్‌ని సంపాదించుకున్నారు. ఇక సినిమాలో వారి కెమిస్ట్రీతో పుష్పరాజ్, శ్రీవల్లిగా ఇండియాస్ ఫేవరెట్ జోడిలలో ఒకరిగా నిలిచారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి పాన్ ఇండియా ఆడియెన్స్‌ని మైమరపించబోతున్నారు. శ్రేయా ఘోషల్ పాడిన ఈ సినిమాలోని కపుల్ సాంగ్‌ని మొత్తం 6 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అల్లు అర్జున్, రష్మికలు అందమైన కాస్ట్యూమ్‌లో మెరుస్తూ కనిపించారు. ఇక ఈ చిత్రం నుండి రిలీజైన పుష్ప పుష్ప అనే టైటిల్ సాంగ్ సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. అయితే బుధవారం ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు15న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News