Friday, December 27, 2024

‘పుష్ప2’లో అల్లు అర్జున్ నట విశ్వరూపం

- Advertisement -
- Advertisement -

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ’పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్ గా ’పుష్ప ది రూల్’ రానుంది. సుమారు మూడు సంవత్సరాల తర్వాత రానున్న ఈ సీక్వెల్ పై ప్రేక్షకులకు, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలు, టైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది.

ఈ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ పాటను లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ “పుష్ప 2 చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళనాడులో ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము”అని అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా, ఫైర్ అనుకుంటున్నారా, వైల్డ్ ఫైర్. నా జీవితంలో ఇంత వైల్డ్‌గా ఇంకా ఎప్పుడు పని చేసి ఉండను. దేవిశ్రీ ప్రసాద్ నాకు ఎన్నో సినిమాలతో ఎంతో మంచి హిట్స్ ఇచ్చాడు. దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప అనే సినిమా లేదు. తనతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఆ సినిమా నేను చేసిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు”అని తెలిపారు.

హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ బన్నీతో కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాట్లాడుతూ “నా జీవితం పుష్పకు ముందు, పుష్పకు తర్వాత అన్నట్లుగా ఈ సినిమాతో మారిపోయింది. అల్లు అర్జున్ నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోయారు”అని తెలియజేశారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ “ఈ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నాం. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఎంతగానో కష్టపడ్డారు. త్వరలోనే మరొక పాట రాబోతుంది. ఆ పాటలో అల్లు అర్జున్ మాస్ డాన్స్ చూడబోతున్నారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి, సీఈఓ చెర్రీ, ఏజెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అర్చన కల్పాతి, దర్శకుడు నెల్సన్, ఆదిత్య రామ్ గ్రూప్ చైర్మన్ ఆదిత్య రామ్, కలైపులి థాను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News