Monday, January 13, 2025

బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2’ కలెక్షన్ల సునామి.. తొలి చిత్రంగా నయా చరిత్ర

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ’పుష్ప 2: ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది. ప్రపంచమంతటా కలిపి 294 కోట్లతో డే1 వసూళ్లతో రికార్డు సాధించింది. ప్రపంచమంతటా పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకెళ్తున్న సందర్భంగా చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థాంక్స్. ‘పుష్ప 2’ వేగంగా 500 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. మరింత విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను”అని తెలియజేశారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “ముందుగా నేను రాజమౌళికి థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయాలని రాజమౌళి అన్నారు. ధియేటర్‌కు వచ్చిన వాళ్ళు 3 గంటలు అంతా మర్చిపోయి సినిమాను చూడాలి అని నేను, నా చిత్ర బృందం చాలా కష్టపడి చేశాం. 10 నిమిషాలలో సీన్ రాసే వాళ్ళు ఉన్నారు దర్శకత్వం టీంలో. నా టీంలో ఉన్న వారు అంతా సుకుమార్‌లే”అని అన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “ఒక సినిమా ఇలాంటి విజయం సాధించడానికి కారణం దర్శకుడు. కాబట్టి మా దర్శకుడు సుకుమార్‌కి ధన్యవాదాలు. సినిమా కలెక్షన్స్ చూస్తే సినిమాను ఎంత మంది ప్రేక్షకులు చూశారో అర్థం అవుతుంది. అనుకోకుండా సంధ్య థియేటర్‌లో జరిగిన సంఘటన మమ్మల్ని ఎంతగానో కదిలించింది. ఆ కుటుంబం కోసం 25 లక్షలు కేవలం ఒక సాయంగా అనుకుని ఇస్తున్నాము. అయినా ఒక మనిషి లేని లోటు ఎవరు తీర్చలేము. అందుకు ఎంతో విచారిస్తున్నాను. అంతా కుదుటపడిన తరువాత వ్యక్తిగతంగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలుస్తాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News